Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సూర్యుడి పనితీరు తగ్గిందట.. భూమికి ప్రమాదం పొంచివుందా?

సూర్యుడి పనితీరు తగ్గిందట.. భూమికి ప్రమాదం పొంచివుందా?
, శనివారం, 16 మే 2020 (13:17 IST)
sun
ప్రపంచానికి వెలుగునిచ్చే సూర్యుడు తన పనిని తగ్గించుకున్నాడనే విషయాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. మానవాళికి భూమిపై నివసించేందుకు సహకరిస్తున్న సూర్యుడిలో మార్పు చోటుచేసుకుంది. భూమికి దాదాపు 15 కోట్ల కిలో మీటర్ల దూరంలో వున్న సూర్యుడిలో అణువులు అపరిమితంగా పనిచేయడం ద్వారా భూమికి వేడి లభిస్తుంది. 
 
అయితే ప్రస్తుతం సూర్యుడి పనితీరు తగ్గడంతో భూమిపై వేడి తగ్గే అవకాశం వున్నట్లు శాస్త్రవేత్తలు చెప్తున్నారు. 200 సంవత్సరాల క్రితం 1790 -1830 మధ్యకాలంలో ఇదేవిధంగా తన ఉగ్రమైన పనితీరును సూర్యుడు తగ్గించుకున్నాడు. ఆ సమయంలో యూరప్‌ దేశం పెను మార్పులను గమనించింది. లండన్‌లో థేమ్స్ నది తొలిసారిగా కరిగిపోయింది. వేసవికాలంలో తీవ్ర మంచు తుఫాను ఏర్పడింది. తద్వారా వ్యవసాయం దెబ్బతింది. కరువు ఏర్పడింది. ఫలితంగా చాలామంది ప్రాణాలు కోల్పోయారు. 
 
1815వ సంవత్సరం ఏప్రిల్ 10వ తేదీ ఇండోనేషియాలో మౌంట్ టంబోరా అనే అగ్నిపర్వతం పేలింది. ఇందులో 70వేల మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఇందుకు భూమిపై వేడి శాతం తగ్గడమే కారణమంటూ శాస్త్రవేత్తలు తెలిపారు. ప్రస్తుతం సూర్యుడు తన పనితీరును తగ్గించుకున్నాడు. ఫలితంగా భూమికి ప్రమాదం ఏర్పడే అవకాశం వుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. 
 
కానీ 11 ఏళ్లకు ఒకసారి సూర్యుడు తన పనితీరును తగ్గించుకోవడం చేస్తాడని.. అయితే ప్రస్తుతం సూర్యుడిలో ఏర్పడిన మార్పు.. భూమిపై వేడిమిని తగ్గిస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. దీని ప్రభావం ప్రమాదాన్ని ఏర్పరచదని వారు అంచనా వేస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనావైరస్: లాక్‌డౌన్ 4.0లో మరిన్ని సడలింపులు, జోన్‌లపై రాష్ట్రాలకే నిర్ణయాధికారం?