Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రభాస్ తర్వాత.. చరణ్‌ తోనే సినిమా, ఎవరు?

Advertiesment
Nag Aswin
, శనివారం, 9 మే 2020 (11:35 IST)
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్‌తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణా మూవీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. వచ్చే సంవత్సరం ప్రధమార్థంలో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ సినిమా తర్వాత ప్రభాస్ మహానటి డైరెక్టర్ నాగ్ అశ్విన్‌తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. 
 
ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ బ్యానర్ పైన సీనియర్ ప్రొడ్యూసర్ అశ్వనీదత్ నిర్మించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. వచ్చే సంవత్సరం ప్రథమార్ధంలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.
 
అయితే... నాగ్ అశ్విన్ గురించి ఓ వార్త బయటకు వచ్చింది. అది ఏంటంటే.. ప్రభాస్‌తో చేస్తున్న సినిమా తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో సినిమా చేయనున్నాడని టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. 
 
ఇంతకీ చరణ్‌తో ఎలాంటి సినిమా అంటే.. జగదేకవీరుడు అతిలోక సుందరి సినిమా సీక్వెల్ అని సమాచారం. ఈ సినిమాకి సీక్వెల్ తీయాలని అశ్వనీదత్ ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నారు కానీ.. ఇప్పటివరకు సెట్ కాలేదు. ఈసారి మాత్రం ఈ సీక్వెల్ పక్కా అంటున్నారు అశ్వనీదత్. చరణ్‌తో నాగ్ అశ్విన్ మూవీ పక్కా అంటున్నారు. అయితే.. అది జగదేకవీరుడు అతిలోక సుందరి సీక్వెల్ అవుతుందా..? లేక వేరే కథతో సినిమా తీస్తారనేది ప్రస్తుతానికి సస్పెన్స్.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హీరోయిన్ కాకపోతే.. కార్డియాలజిస్ట్ అయ్యేదట.. ఎవరో తెలుసా.. హైబ్రిడ్ పిల్ల!