సాహోతో మల్లీశ్వరి? నాగ్ అశ్విన్ దర్శకుడు ప్లాన్!

బుధవారం, 11 మార్చి 2020 (08:39 IST)
'మహానటి' వంటి చిత్రాన్ని తెరకెక్కించి ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్రవేసుకున్న యువ దర్శకుడు నాగ్ అశ్విన్. ఈయన బాహుబలి ప్రభాస్‌ని డైరెక్ట్ చేయనున్నారు. ఈ చిత్ర కథ ఇప్పటికే సిద్ధం కాగా, హీరోయిన్ వేటలో దర్శకుడు ఉన్నట్టు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. 
 
టాలీవుడ్ వర్గాల సమాచారం మేరకు... నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించే చిత్రం పాన్ ఇండియాగా ఉండనుంది. తెలుగు, తమిళం, హిందీ భాషలతో పాటు.. కన్నడ, మలయాళం భాషల్లో ఏకకాలంలో నిర్మించేలా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. 
 
అలాంటి పాన్ ఇండియా చిత్రంలో హీరోయిన్‌గా పలువురు బాలీవుడ్ భామల పేర్లను పరిశీలించారు. వారిలో ప్రధానంగా దీపికా పదుకొనె, ప్రియాంకా చోప్రా పేర్లను ప్రధానంగా వినిపించాయి. కానీ, ఇపుడు కత్రినా కైఫ్ పేరు తెరపైకి వచ్చింది. 
 
ఈమె గతంలో రెండు చిత్రాల్లో నటించింది. ఒకటి వెంకటేష్ నటించిన 'మల్లీశ్వరి' చిత్రంలో నటించగా, ఆ తర్వాత 'అల్లరి పిడుగు' చిత్రంలో నటించింది. దీంతో ఈ దఫా వచ్చే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్న భావనలో కత్రినా కైఫ్ ఉన్నట్టు వినికిడి. 
 
కాగా, ప్రభాస్ 'బాహుబలి' తర్వాత నటించిన చిత్రం 'సాహో'. ఈ చిత్రంలో శ్రద్ధా కపూర్ హీరోయిన్. ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో చేస్తున్న సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. ఈ చిత్రం తర్వాత కూడా బాలీవుడ్ భామనే ప్రభాస్ ఎంపిక చేసుకోవడం గమనార్హం. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం ఉప్పెన మూవీకి - సీతాకోక చిలకకి సంబంధం ఏంటి?