ప్రభాస్‌కు కరోనా వైరస్ భయం, ముఖానికి మాస్క్‌, పిక్ వైరల్

బుధవారం, 4 మార్చి 2020 (10:52 IST)
బాహుబలి హీరో ప్రభాస్‌కు కరోనా వైరస్ భయంపట్టుకుంది. దీంతో ఆయన ముఖానికి మాస్క్‌ ధరించి తిరుగుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.
 
చైనాలోను వూహాన్ నగరంలో వెలుగు చూసిన కరోనా వైరస్ ఇపుడు ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇప్పటికే 65 దేశాలకు వ్యాపించిన ఈ వైరస్.. భారత్‌లోనూ తన సత్తా చాటుతోంది. హైదరాబాద్, ఢిల్లీలో రెండు కరోనా కేసులు బయటపడ్డాయి. హైదరాబాద్ నగరంలో మరో ఇద్దరు కరోనా వైరస్ అనుమానితులు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. 
 
ఈ క్రమంలో హైదరాబాదులో కూడా కరోనా కేసులు నమోదు కావడం కలవరపరుస్తోంది. దీంతో, జనాలు ముందస్తు చర్యల్లో భాగంగా తగు జాగ్రత్తలు తీసుకోవడం ప్రారంభించారు. ముఖాలకు మాస్క్‌లు ధరిస్తున్నారు. దీంతో మాస్కుల ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. 
 
ఈ నేపథ్యంలో టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ కూడా మాస్క్ ధరించి కనిపించాడు. ఎయిర్ పోర్టు నుంచి వస్తున్న సమయంలో మాస్క్ ధరించాడు. చాలా వేగంగా నడుస్తూ కనిపించాడు. కరోనా వైరస్ నేపథ్యంలో అందరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని, మాస్కులను ధరించడం వల్ల ఉపయోగం ఉంటుందనే సందేశాన్ని ప్రభాస్ తన అభిమానులకు ఇచ్చినట్టయింది. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం ట్విట్టర్‌లో 'వకీల్ సాబ్' సునామీ...