Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నయనతారకు, విఘ్నేష్‌కు కరోనా సోకిందా? (video)

Advertiesment
నయనతారకు, విఘ్నేష్‌కు కరోనా సోకిందా? (video)
, సోమవారం, 22 జూన్ 2020 (12:11 IST)
కరోనా వైరస్ రోజు రోజుకీ విజృంభిస్తోన్న తరుణంలో వదంతులు పెచ్చరిల్లిపోతున్నాయి. తమిళనాడులో కరోనా కేసులు పెరుగుతున్నాయి. చెన్నై నగరంలోనూ రోజు రోజుకు పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో చాలా మంది సినీ సెలబ్రిటీలు నగరాన్ని వదిలేసి వెళ్తున్నారు. షూటింగ్ నిలిచిపోయాయి. 
 
ఈ నేపథ్యంలో సోషల్‌మీడియా వేదికగా ఫేక్‌ న్యూస్‌ వైరల్ అవుతుంది. ఈ క్రమంలో దక్షిణాది లేడి సూపర్‌స్టార్ నయనతారకు కరోనా వైరస్ సోకినట్లు సోషల్ మీడియా వార్తలు వైరల్‌గా మారాయి. ఆమెతో పాటు నయన్ ప్రియుడు విఘ్నేష్ శివన్‌కి కూడా వైరస్ సోకిందని వార్తలు వచ్చాయి. దీంతో ఆమె ఫ్యాన్స్ ఆందోళన చెందారు.
 
ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని విఘ్నేశ్ శివన్ స్పష్టం చేశారు. తన ఆరోగ్యం గురించి వస్తోన్న వార్తలపై విఘ్నేశ్‌ స్పందించారు. తాము ఎంతో ఆరోగ్యంగా ఉన్నామని పేర్కొంటూ ఓ ప్రత్యేక వీడియోను నెట్టింట్లో పోస్ట్‌ చేశారు. నయన్‌, విఘ్నేశ్‌ సరదాగా డ్యాన్స్‌ చేస్తూ వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. నయనతార ఆరోగ్యంగా ఉందని, అలాంటి పుకార్లను నమ్మొద్దని కోరింది.  


Share this Story:

వెబ్దునియా పై చదవండి

తెలుగు వార్తలు ఆరోగ్యం వినోదం పంచాంగం ట్రెండింగ్..

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నేను ద్విలింగ సంపర్కుడిని.. గర్వంగా ఫీలవుతున్నా : బాలీవుడ్ నిర్మాత