Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో ట్రిబుల్ సెంచరీ కొట్టిన కరోనా కేసులు - ప్రపంచంలో 79 లక్షలు

Webdunia
సోమవారం, 15 జూన్ 2020 (16:07 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తికి ఇప్పట్లో అడ్డుకట్టపడేలా లేదు. ఫలితంగా గడిచిన 24 గంటల్లో 304 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ఓ ఆరోగ్య బులిటెన్‌ను విడుదల చేసింది. 
 
ఏపీలో కొత్తగా 304 మందికి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో ఏపీకి చెందిన వారు 246 మంది కాగా, ఇతర రాష్ట్రాలకు చెందిన 52 మంది, విదేశాలకు చెందినవారు 8 మంది కరోనా వైరస్ బారినపడ్డారు. 
 
రాష్ట్రానికి చెందిన లెక్కలను పరిశీలిస్తే.. గత 24 గంటల్లో 15, 173 శాంపిల్స్‌ను పరీక్షించగా 246 మంది కోవిడ్ -19 పాజిటివ్‌గా తేలారు. 47 మంది కోవిడ్ నుంచి తేరుకుని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారు. 
 
కర్నూల్, అనంతపురం జిల్లాలలో ఒక్కొక్కరు మరణించారు. రాష్ట్రంలో నమోదైన మొత్తం 5087 కేసుల్లో 2770 మంది డిశ్చార్జ్ కాగా 86 మంది మరణించారు. ప్రస్తుతం 2231 మంది చికిత్స పొందుతున్నారు. 
 
విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారి లెక్కలను ప్రత్యేకంగా విడుదల చేశారు. మొత్తం 210 మంది పాజిటివ్ కాగా, 187 మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ఇక ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 1,159 మందికి పాజిటివ్ కాగా, 567 మంది చికిత్స పొందుతున్నారు. 
 
మరోవైపు, ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 79 లక్షలు దాటిపోయాయి. అదేవిధంగా 4 లక్షల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఇక ప్రపంచవ్యాప్తంగా గత 24 గంటల్లో మొత్తం 79,90,151 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా మొత్తం 4,35,496 మంది మృతి చెందగా.. కరోనా బారినపడి 41,08,052 మంది కోలుకున్నారు.
 
కరోనా వైరస్ దెబ్బకు అగ్రరాజ్యం అమెరికా ఇప్పటికీ వణికిపోతోంది. న్యూజెర్సీ, న్యూయార్క్‌పై కరోనా విలయం కొనసాగుతోంది. అమెరికాలో గత 24 గంటల్లో మొత్తం 21,62,144 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 1,17,853 మంది మృతి చెందగా.. కరోనా బారిన పడి 8,67,849 మంది కోలుకున్నారు. 
 
బ్రెజిల్‌లోనూ వైరస్ ఉధృతి కొనసాగుతోంది. గత 24 గంటల్లో మొత్తం 8,67,882 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 43,389 మంది మృతి చెందగా.. కరోనా బారిన పడి 4,37,512 మంది కోలుకున్నారు. రష్యాలో గత 24 గంటల్లో మొత్తం 5,28,964 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు మొత్తం 6,948 మంది మృతి చెందగా.. కరోనా బారిన పడి 2,80,050 మంది కోలుకున్నారు.
 
ఇకపోతే, బ్రిటన్‌లో గత 24 గంటల్లో మొత్తం 2,95,889 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు మొత్తం 41,698 మంది మృతి చెందగా.. కరోనా బారిన పడి 30,257 మంది కోలుకున్నారు. ఇటలీలో కూడా కేసుల తీవ్రత పెరుగుతోంది. ఇప్పటివరకు మొత్తం 34,345 మంది మృతి చెందగా.. కరోనా బారిన పడి 1,76,370 మంది కోలుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments