తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటికే ఆ రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా నమోదవుతున్నాయి. అదేసమయంలో ఈ వైరస్ బారిన ఆ రాష్ట్ర ప్రజా ప్రతినిధులు కూడా పడుతున్నారు. రెండు రోజుల క్రితం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి ఈ వైరస్ బారినపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తాజాగా మరో ఎమ్మెల్యే ఈ వైరస్ కోరల్లో చిక్కున్నారు. ఆయన పేరు బాజిరెడ్డి గోవర్థన్ రెడ్డి.
నిజామాబాద్ రూరల్ స్థానం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న బాజిరెడ్డి గోవర్థన్‌కు కరోనా జిటివ్ అని వైద్యులు నిర్ధారించారు. ఆయన 3 రోజుల నుంచి జ్వరం, దగ్గుతో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ఆ తర్వాత ఆయనకు వైద్య పరీక్షలు చేయగా, కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయన్ను వెంటనే చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. ఆయన శనివారం నాడు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.