Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పాకిస్థాన్ మాజీ ప్రధాని గిలానీకి కరోనా పాజిటివ్

Advertiesment
Yusuf Raza Gilani
, శనివారం, 13 జూన్ 2020 (20:28 IST)
పాకిస్థాన్ దేశంలో కూడా కరోనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తోంది. దీంతో ఆ దేశ రాజకీయ నాయకులకు కరోనా భయం పట్టుకుంది. ఇప్పటికే పలువురు రాజకీయ నేతలకు ఈ వైరస్ సోకింది. ఇపుడు ఆ దేశ మాజీ ప్రధాని యూసుఫ్ రజా గిలానీ కూడా కరోనా బారినపడ్డారు. గిలానీకి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని ఆయన కుమారుడు కాసిమ్ గిలానీ వెల్లడించారు. 
 
అయితే, తన తండ్రికి కరోనా వైరస్ సోకడంపై కాసిమ్ గిలానీ స్పందిస్తూ ఆ దేశంలోని ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వాన్ని తప్పుబట్టారు. 'ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వానికి, నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరోకి కృతజ్ఞతలు. మా నాన్న జీవితాన్ని మీరు విజయవంతంగా ప్రమాదంలోకి నెట్టగలిగారు. ఆయన కరోనా పరీక్ష పాజిటివ్ అని వచ్చింది' అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు.
 
కాగా, ఇటీవల పీటీఐ, పీఎంఎల్ ఎన్ పార్టీల నేతల్లో చాలామంది కరోనా బారినపడిన విషయం తెల్సిందే. ప్రధాన విపక్ష నేత, పీఎంఎల్ ఎన్ పార్టీ అధినేత షహబాజ్ షరీఫ్‌కు కూడా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. మాజీ ప్రధాని షాహిద్ ఖఖాన్ అబ్బాసీ, రైల్వే మంత్రి షేక్ రషీద్ సైతం కరోనా బాధితుల జాబితాలో చేరారు. 
 
పాకిస్థాన్‌లో మొట్టమొదటి కేసు ఫిబ్రవరి 26న వెలుగు చూడగా, అప్పటి నుంచి ఇప్పటివరకు 1,32,405 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 2,551 మంది మృత్యువాత పడగా, 50 వేల మందికి పైగా కోలుకున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కొత్త మ్యాప్‌కు నేపాల్ పార్లమెంట్ ఆమోదం - అది చెల్లదంటున్న భారత్!