Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు రాష్ట్రాల్లో కరోనా ఉధృతి.. 4వేల మార్కును దాటిన కోవిడ్.. ఏపీలో 6వేల కేసులు

Webdunia
సోమవారం, 19 ఏప్రియల్ 2021 (11:32 IST)
దేశ వ్యాప్తంగా కరోనా కోరలు చాస్తుంది. ఇప్పటికే పలు రాష్ట్రాలు స్వయంగా లాక్ డౌన్ విధించుకుంటున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో సైతం కరోనా పంజా విసురుతుంది. ఇక ఆంద్రప్రదేశ్‏లో గడిచిన 24 గంటల్లో 35,922 పరీక్షలు నిర్వహించగా… 6,582 నిర్ధారణ అయ్యాయి. తాజా కేసులతో కలిసి ఇప్పటి వరకు రాష్ట్రంలో 9,62,037 మంది వైరస్ భారిన పడినట్లు రాష్టర వైద్య రోగ్య శాఖ వెల్లడించింది.
 
గడిచిన 24 గంటల వ్యవధిలో కోవిడ్ వల్ల 22 మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. చిత్తూరులో ఐదుగురు, కృష్ణా, నెల్లూరులో నలుగురు చొప్పున, కర్నూల్‏లో ముగ్గురు, అనంతపురం, గుంటూరులో ఇద్ధరేసి, విశాఖ, విజయనగరం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 7,410కి చేరింది.
 
ఏపీలో కరోనా పంజా విసురుతోంది. రోజు రోజుకూ కేసుల సంఖ్య ఊహించని స్థాయిలో పెరుగుతున్నాయి. ముఖ్యంగా చాలా వరకు విద్యా సంస్థలు కరోనాకు హాట్ స్పాట్ జోన్ లుగా నిలుస్తున్నాయి. దీంతో పరీక్షలతో పాటు, స్కూళ్ల నిర్వహణపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోక తప్పడం లేదు
 
తెలంగాణలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. తెలంగాణలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. గత కొద్దిరోజులుగా వరుసగా 4వేల మార్క్‌ను దాటుతున్నాయి. శనివారం(ఏప్రిల్ 17) రాత్రి 8గం. నుంచి ఆదివారం రాత్రి 8గం. వరకు 4009 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 14 మంది కరోనాతో మృతి చెందారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ సోమవారం(ఏప్రిల్ 19) హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
 
మరో 5104 రిపోర్టులు ఇంకా రావాల్సి ఉంది. తాజా కేసులతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,55,433కి చేరింది. మొత్తం మృతుల సంఖ్య 1838కి చేరింది. ప్రస్తుతం 39,154 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 1878 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటివరకూ రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 3,14,441కి చేరింది.
 
ప్రస్తుతం దేశంలో మరణాల రేటు 1.2శాతం ఉండగా... తెలంగాణలో 0.51శాతం ఉంది. జాతీయ స్థాయిలో రికవరీ రేటు 86 శాతం ఉండగా తెలంగాణలో 88.46 శాతం ఉంది. తాజాగా గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో 705 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకూ 1,18,20,842 కరోనా టెస్టులు నిర్వహించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏంటయ్యా ఇది.. హీరోలైనా వరకట్నం కోసం వేధిస్తారా? హీరో ధర్మ మహేష్‌పై కేసులు

Court : రహస్యంగా కోర్టు దర్శకుడి వివాహం.. వధువు ఎవరంటే?

ప్రభాస్‌తో స్నేహం వుంది: శ్రీ దేవి విజయ్ కుమార్

CM: ఎ.రేవంత్ రెడ్డి ని కలిసిన జాతీయ ఫిల్మ్ అవార్డ్సు గ్ర‌హీత‌లు

మంజుమ్మెల్ బాయ్స్ డైరెక్టర్ చిదంబరం మూవీ బాలన్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments