Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆవిరి పడితే కరోనా చావదు.. ఈ ఆహారం తీసుకుంటే.. గోరువెచ్చని నీటిని..?

Advertiesment
ఆవిరి పడితే కరోనా చావదు.. ఈ ఆహారం తీసుకుంటే.. గోరువెచ్చని నీటిని..?
, శనివారం, 17 ఏప్రియల్ 2021 (12:25 IST)
కరోనా వైరస్ లక్షణాలు మారుతూనే వస్తున్నాయి. జలుబు, దగ్గు వంటి రుగ్మతలు కోవిడ్ లక్షణాలుగా చెప్పబడుతున్నాయి. అయితే ఈ జలుబు, దగ్గు మాత్రమే కోవిడ్ లక్షణాల్లో బేసిక్ కాదని.. రుచి తెలియకపోవడం, శ్వాస తీసుకోవడం ఇబ్బందులు ఏర్పడటం వంటివి కూడా కోవిడ్ లక్షణాల్లో ప్రధానమని వైద్యులు చెప్తున్నారు. అయితే తాజాగా ఆవిరి పట్టడం వల్ల కరోనా వైరస్ చనిపోతుందని వార్తలు వస్తున్నాయి. 
 
ఈ వార్తల్లో నిజం లేదని కరోనా వైరస్‌కి ట్రీట్‌మెంట్‌లో ఆవిరి పట్టడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు అని యు ఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ లేదా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా చెప్తున్నారు. కరోనా వైరస్ ఇంటి చిట్కాలతో తొలగిపోదని చెప్తున్నారు. ఆవిరి పట్టడం వల్ల జలుబు, దగ్గు లక్షణాలు తొలగిపోతాయని మాత్రమే చెబుతున్నారు. అలాగే జలుబు, దగ్గు నుంచి ఆవిరి పట్టడం ద్వారా కాస్త ఉపశమనం మాత్రమే లభిస్తుందని.. కానీ వైరస్ కారణంగా వచ్చే ఇన్ఫెక్షన్ ఏమాత్రం తగ్గదని అంటున్నారు.
 
అయితే ఆయుర్వేద వైద్యులు మాత్రం వేడి నీళ్లు తాగడం మంచిదంటున్నారు. గోరువెచ్చని నీటిని సేవించడం.. ద్వారా జలుబు దరి చేరదు అంటున్నారు. తద్వారా ఊపిరి తీసుకునే సమస్యలు వుండవంటున్నారు. కరోనా దరిచేరకుండా వుండాలంటే.. వారంలో కనీసం మూడు సార్లు ఆవిరి పడితే మంచిదని అంటున్నారు. ఇంట్లో ఉండే వాళ్ళు రోజుకు ఒకసారి, బయటకు వెళ్లి కూరగాయలు కొనేవాళ్ళు రెండుసార్లు, ఆఫీస్‌కు వెళ్లే వాళ్ళు మూడుసార్లు ఆవిరి పట్టాలని చెప్తున్నారు. 
 
అలాగే శరీరంలో రోగ నిరోధక శక్తి పెంపు కోసం ప్రోబయోటిక్స్ ఎక్కువగా ఉన్న ఆహారాలను తీసుకోవాలి. పెరుగులో ప్రోబయోటిక్స్ సమృద్ధిగా ఉంటాయి. అంతేగాక పెరుగు అనేక వ్యాధి కారకాలను నిర్మూలిస్తుంది. ఒంట్లో మంటను కూడా తగ్గిస్తుంది. ప్రతిరోజు ఒక కప్పు పెరుగు తీసుకోవడంవల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది.
 
వ్యాధి నిరోధక శక్తి పెరుగడానికి గ్రీన్ టీ బాగా ఉపయోగపడుతుంది. గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. కాబట్టి ప్రతిరోజు గ్రీన్ టీ తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది. విటమిన్ డి ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవడంవల్ల కూడా రోగనిరోధక శక్తి పెరుగుతుంది. విటమిన్ డి సాధారణంగా సూర్యరశ్మి నుంచి లభిస్తుంది. అదేవిధంగా సాల్మన్‌ చేపలు, బలవర్ధకమైన పాలలో కూడా విటమిన్ డి ఉంటుంది. 
webdunia
mushrooms
 
పుట్టగొడుగులు కూడా వ్యాధినిరోధక శక్తిని పెంచడంలో కీలకపాత్ర పోషిస్తాయి. విటమిన్ బి, ప్రొటీన్, ఫైబర్, విటమిన్ సి, క్యాల్షియం, ఇతర ఖనిజాలు ఉండటంవల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. యాంటీ ఇన్ఫెక్షన్ కార్యకలాపాల కోసం పుట్టగొడుగులు తెల్ల రక్త కణాలను ఉత్తేజపరిస్తాయి. కాబట్టి రోగనిరోధక శక్తి పెరుగాలంటే ప్రతిరోజు ఒక కప్పు పుట్టగొడుగులు తినడం మంచిదంటున్నారు ఆయుర్వేద నిపుణులు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మధుమేహ వ్యాధిని అదుపులో వుంచే యాలకులు