ప్రముఖ హాస్యనటుడు వివేక్ గుండెపోటుతో ఆస్పత్రిలో చేరారు. కోలీవుడ్ స్టార్ కమెడియన్ అయిన వివేక్ శ్వాస రుగ్మతలతో ఆస్పత్రిలో చేరారు. ఉన్నట్టుండి శ్వాస తీసుకోవడంలో శ్రమపడిన వివేక్‌ను ఆయన భార్య, కుమారుడు చెన్నై, వడపళనిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు.
ఐసీయూలో వివేక్‌కు చికిత్స అందిస్తున్నారు వైద్యులు. ఆయన ఆరోగ్యం నిలకడగా వుందని అబ్జర్వేషన్‌లో వున్నారని వైద్యులు చెప్పుకొచ్చారు. నటుడు వివేక్ కరోనా వ్యాక్సిన్ వేయించుకోవడం ద్వారా గుండెపోటుతో ఆస్పత్రిలో జాయిన్ అయ్యారని తెలుస్తోంది. కాగా గతంలో వివేక్ కుమారుడు డెంగ్యూ జ్వరంతో ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.