తమిళ బుల్లితెర నటుడు ఇంద్రకుమార్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన స్నేహితుడి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. ఇంద్రకుమార్ తన స్నేహితుడిని కలిసేందుకు వెళ్లి అతని ఇంట్లో శవమై కనిపించాడు. ఈ విషయం తెలుసుకున్న నటుడు స్నేహితుడు వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. ఇంద్రకుమార్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పంపించామని, పోలీసులు ఈ విషయాన్ని పరిశీలిస్తున్నారని తెలిపారు.
బుధవారం సాయంత్రం తన స్నేహితులతో కలిసి సినిమా చూసేందుకు వెళ్లిన విషయాన్ని ఇంద్రకుమార్ స్నేహితుడు తెలిపాడు. ఆ తర్వాత తన స్నేహితుడి ఇంట్లో ఒంటరిగా ఉన్నాడు. ఉదయం స్నేహితుడు గది వద్దకు వచ్చేసరికి ఇంద్రకుమార్ తలుపు తీయలేదు.
అనంతరం తలుపు తీయగానే తన స్నేహితుడు శవమై కనిపించాడు. ఈ కేసు దర్యాప్తును పోలీసులు ప్రారంభించారు. అయితే, ఆ ప్రాంతం నుంచి ఎలాంటి సూసైడ్ నోట్ అందలేదు. ఇంద్ర కుమార్ తీసుకున్న ఈ నిర్ణయం వెనుక గల కారణం ఇంకా తెలియరాలేదు. ప్రస్తుతం పోలీసులు దర్యాప్తును నిర్వహిస్తున్నారు. పలు తమిళ టెలివిజన్ షోలలో ఆయన నటించారు. ఆ నటుడికి పెళ్లయి, ఒక బిడ్డ కూడా ఉన్నాడు. ఇంద్రకుమార్‌కు అతని భార్యతో విబేధాలున్నాయని తెలుస్తోంది.