Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అనిల్ రావిపూడికి కరోనా - అర్జున్ రాంపాల్‌కు పాజిటివ్

Advertiesment
Anil Ravipudi
, ఆదివారం, 18 ఏప్రియల్ 2021 (09:17 IST)
తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన హిట్ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడికి కరోనా వైరస్ సంక్రమించింది. గత కొన్ని రోజులుగా చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు ఒకరితర్వాత ఒకరు ఈ వైరస్ బారినపడుతున్నారు. తాజాగా హిట్ చిత్రాల ద‌ర్శ‌కుడు అనీల్ రావిపూడికి క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయింది. ఈ విష‌యం తెలుసుకున్న అనీల్ రావిపూడి వెంట‌నే ఐసోలేష‌న్‌కు వెళ్ళారు. 
 
ప్ర‌స్తుతం అనీల్ రావిపూడి  "ఎఫ్-3" అనే చిత్రంతో బిజీగా ఉన్నారు. ఈ మూవీ కొత్త షూటింగ్ షెడ్యూల్ ఇటీవ‌ల మైసూర్‌లో ప్రారంభ‌మైంది. వెంక‌టేష్‌పై కీల‌క స‌న్నివేశాలు చిత్రీక‌రిస్తున్నారు. ఇటీవ‌ల "దృశ్యం-2" షూటింగ్ పూర్తి చేసుకున్న వెంకీ రీసెంట్‌గా "ఎఫ్-3" చిత్ర బృందంతో క‌లిసారు. 
 
ఇప్పుడు అనీల్ రావిపూడికి క‌రోనా అని తెలియ‌డంతో షూటింగ్‌కు తాత్కాలిక బ్రేక్ ప‌డిన‌ట్టు తెలుస్తుంది. కాగా, "ఎఫ్-3 చిత్రం దిల్‌రాజు నిర్మాతగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌లో తెర‌కెక్కుతుండ‌గా, ఇందులో వెంకటేష్‌, వరుణ్‌తేజ్‌, మెహరీన్‌, తమన్నా నటిస్తున్నారు.
 
మరోవైపు, బాలీవుడ్‌పై కరోనా పంజా విసురుతోంది. ఇప్పటికే పెద్ద ఎత్తున సినీ ప్రముఖులు వైరస్ బారినపడగా.. తాజాగా నటుడు అర్జున్‌ రాంపాల్‌ వైరస్‌కు పాజిటివ్‌గా పరీక్షలు చేశారు. ఈ విషయాన్ని ఇస్టాగ్రామ్‌ ద్వారా తెలిపారు. తాను కరోనా పాజిటివ్‌గా పరీక్ష చేశానని, లక్షణాలు ఏమీ లేవని తెలిపారు. 
 
ప్రస్తుతం ఇంట్లో సెల్ఫ్‌ ఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలిపారు. అవసరమైన వైద్య సేవలు తీసుకుంటున్నానని, అలాగే అన్ని ప్రోటోకాల్స్‌ పాటిస్తున్నట్లు చెప్పారు. ఇటీవల తనను కలిసిన వారంతా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఇది భయానక సమయమని.. అప్రమత్తంగా ఉంటే దీర్ఘకాలిక ప్రయోజనాలు ఇస్తుందని పేర్కొన్నారు.
 
ఇదిలా ఉండగా.. కరోనా సెకండ్‌ వేవ్‌లో ఇప్పటికే చాలా మంది బాలీవుడ్‌ ప్రముఖులు వైరస్‌కు పాజిటివ్‌గా పరీక్షలు చేశారు. కొన్ని వారాల వ్యవధిలో పెద్ద ఎత్తున సెలబ్రెటీలకు మహమ్మారి సోకగా చాలా మంది కోలుకున్నారు. ఇటీవల నీల్‌ నితిన్‌ ముఖేష్‌, సోనుసూద్‌, మనీష్‌ మల్హోత్రా, కత్రినా కైఫ్‌, అక్షయ్‌కుమార్‌, గోవింద, పరేష్‌ రావల్‌, అలియా భట్‌, రణబీర్‌ కపూర్‌, రోహిత్‌ సారాఫ్‌తో పాటు పలువురు కొవిడ్‌కు బారినపడ్డారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎఫ్‌3కి క‌రోనా ఎఫెక్ట్- ఆందోళ‌న‌లో సినీప్ర‌ముఖులు‌