Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైసీపీ నాయకుడి ఇంట్లో పేకాట..30 మంది అరెస్టు

Webdunia
సోమవారం, 19 ఏప్రియల్ 2021 (11:27 IST)
వైసీపీ నాయకుడి ఇంట్లో నిర్వహిస్తున్న పేకాట శిబిరంపై ఎస్‌ఈబీ పోలీసులు దాడి చేసి 30 మందిని అరెస్టు చేశారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో ఆదివారం ఈ  దాడి నిర్వహించారు.

తొమ్మండ్రు వీధిలోని వైసీపీ నాయకుడు సింగం భరత్‌రెడ్డి ఇంట్లో పేకాడుతున్న 30 మందిని అరెస్టు చేశామని ఎస్‌ఈబీ సీఐ సుదర్శన్‌రెడ్డి తెలిపారు. వారి నుంచి రూ.6.23 లక్షల నగదు, మూడు కార్లు, మూడు మో టార్‌ సైకిళ్లు స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడిచారు.

పట్టుబడినవారిలో కడప జిల్లా ప్రొద్దుటూరు, మైదుకూరు, ఎర్రగుంట్ల పట్టణాల నుంచి వ చ్చిన వారున్నారని తెలిపారు. ఆళ్లగడ్డ పట్టణానికి చెందిన ముగ్గురు వైసీపీ నాయకులనూ అదుపులోకి తీసుకున్నామని చెప్పారు.

పేకాటలో డబ్బుకు బదులుగా టోకెన్లను కొనుగోలు చేసి వినియోగిస్తున్నారని, టోకెన్ల విలువను బట్టి గెలిచినవారికి డబ్బు చెల్లిస్తున్నారని సీఐ తెలిపారు. ఆళ్లగడ్డ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments