కోవిషీల్డ్ టీకా డోసుల మధ్య విరామం ఎంత ఉండాలంటే?

Webdunia
బుధవారం, 19 మే 2021 (14:12 IST)
కరోనా వైరస్ బారినపడకుండా ఉండేందుకు వీలుగా ప్రస్తుతం కొన్ని రకాల టీకాలు అందుబాటులోకి వచ్చాయి. ఈ టీకాను రెండు డోసులుగా వేసుకున్నట్టయితే ఈ వైరస్ బారినపడుకుండా రక్షించుకోవచ్చని వైద్యులు పదేపదే చెబుతున్నారు. అలాంటి టీకాల్లో ఒకటి కోవిషీల్డ్. 
 
ఈ టీకాను తొలి డోస్ వేసుకున్న తర్వాత రెండో డోసుకు వేయించుకునేందుకు ఎంత విరామం ఉండాలన్నదానిపై పలు రకాలైన అభిప్రాయాలు ఉన్నాయి. ఈ అంశంపై ప్రజల్లో గందరగోళం తలెత్తుతోంది. అయితే దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరమేమీ లేదని నిపుణులు చెబుతున్నారు. 
 
రెండో డోసును ఆరు నెలలలోపు తీసుకున్నా.. అది సమర్థంగానే పనిచేస్తుందని భరోసా ఇస్తున్నారు. కొవిషీల్డ్‌ టీకా డోసుల మధ్య విరామాన్ని 12-16 వారాలకు కేంద్ర ప్రభుత్వం ఇటీవలే పొడిగించింది. ఇదేసమయంలో బ్రిటన్‌ ప్రభుత్వం దీన్ని 12 వారాల నుంచి 8 వారాలకు తగ్గించింది. 
 
అయితే, భారత్‌ నుంచి వచ్చిన ‘బి.1.617’ రకం కరోనా వైరస్‌ తమ దేశంలో ఉద్ధృతంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. టీకా డోసుల మధ్య విరామాన్ని భారత్‌లో పెంచడంపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి. 
 
ఢిల్లీలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇమ్యునాలజీ శాస్త్రవేత్త సత్యజిత్‌ రథ్‌ దీనిపై స్పందించారు. మొదటి డోసు పొందిన నాలుగు వారాల తర్వాత నుంచి ఎప్పుడైనా రెండో డోసును ఇవ్వవచ్చు. ఆరు నెలలలోపు ఇస్తే సరిపోతుంది. అయినా దాని బూస్టర్‌ సామర్థ్యంలో తేడా ఉండదు. అద్భుతంగా రోగ నిరోధక స్పందనను పెంచుతుందన్నారు. అలాగే, మొదటి డోసు పొందిన నెలలోపు రెండో డోసును పొందినా.. టీకా రక్షణ సామర్థ్యమేమీ పెరగబోదని చెప్పారు. 
 
అయితే, కొవిషీల్డ్‌ రెండో డోసును.. మొదటి టీకా పొందిన మూడు నెలల తర్వాత ఇస్తే సమర్థంగా పనిచేస్తుందని ప్రముఖ వైద్య పత్రిక ‘లాన్సెట్‌’లో ప్రచురితమైన అధ్యయనం పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bigg Boss Telugu 9- బిగ్ బాస్ తెలుగు 9 : ఈ వారం ఎలిమినేషన్ వుండదా?

Prabhas: యుద్దం నేపథ్యంలో శంబాల ట్రైలర్‌.. ఆవిష్కరించిన ప్రభాస్

Allari Naresh: ప్రేమ, థ్రిల్ ఎలిమెంట్స్ తో అల్లరి నరేష్ 12A రైల్వే కాలనీ

Bhagyashree Borse: నక్షత్రాల మధ్య ఆటలాడుతూ, వెన్నెల్లో తేలియాడుతూ.. రామ్, భాగ్యశ్రీ బోర్సే

Mass Jatara Review: జరుగుతున్న కథతో ఫ్యాన్స్ ఫార్ములాగా మాస్ జాతర - మూవీ రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

తర్వాతి కథనం
Show comments