కరోనాకు హోమియోపతి ఔషధం సూపర్‌గా పనిచేస్తుందట. తమిళనాడులో కేసుల సంఖ్య పెరుగుతున్న తరుణంలో హోమియోపతి మందుల వాడకంపై కరోనా రోగులకు వైద్యం అందించే వైద్యులు దృష్టిసారిస్తున్నారు. రోజూ మిరియాలు, అల్లం, జీలకర్ర పొడులతో కషాయంలా తయారు చేసి.. గ్రామాలు, జిల్లాల్లో పంచుతున్నారు ప్రభుత్వ అధికారులు.
ప్రస్తుతం హోమియోపతికి చెందిన Arsenicum alb 30 అనే మందుకు కరోనా సోకకుండా వుండేందుకు.. శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచేందుకు ఉపయోగించవచ్చునని తమిళ సర్కారు ఆదేశాలు జారీ చేసింది. Arsenicum alb 30 అనే ఈ మందును మూడు రోజుల పాటు పరగడుపున తీసుకోవాలని ఆయుష్ మంత్రిత్వ శాఖ సూచించింది. Arsenicum alb 30 అనే హోమియోపతి మందు వ్యాధినిరోధక శక్తిని పెంచుతుందని.. అందుకే దీనిని కరోనా నుంచి బయటపడాలనుకునేవారు తీసుకోవాలని ఆయుష్ మంత్రిత్వ శాఖ పేర్కొంది.
ఇప్పటికే ప్రిన్స్ ఛార్లెస్ హోమియోపతి మందులను ఉపయోగించడం ద్వారా ఆరు రోజుల్లో కోవిడ్ -19 నుంచి కోలుకున్నాడు. సాధారణ హోమియోపతి మందుల ద్వారా ప్రపంచవ్యాప్తంగా చాలా మంది రోగులు నయమవుతారు. అయితే మనలో కొందరు పరీక్షించని, అశాస్త్రీయ ప్రమాదకరమైన ఔషధాలను కోవిడ్ నివారణకు ఉపయోగిస్తున్నారు. దీని ఫలితంగా అత్యధిక మరణాలు సంభవిస్తున్నాయి.
ఇంకా చెప్పాలంటే..? బ్రిటీష్ రాయల్ ఫ్యామిలీ ఈ హోమియోపతి మందులను వుపయోగిస్తుంది. ఇంకా మూడుతరాల వరకు ఈ మందుల వాడకాన్ని ఆమోదించింది. బ్రిటీష్ హోమియోపతిక్ అసోసియేషన్‌లో క్వీన్ ఎలిజబెత్ సభ్యురాలు కావడం గమనార్హం. Ars alb 30 అనే పిల్స్‌ను ఉదయం, RHUS TOX 200 4 పిల్స్ సాయంత్రం తీసుకుంటే.. కరోనాను నియంత్రించవచ్చును.
మార్చి 10 పదో తేదీన ప్రిన్స్ ఛార్లెస్‌కు కరోనా లక్షణాలు తెలియగా, ఆరు రోజుల వరకు ఈ మందును తీసుకున్న ఛార్లెస్‌కు ఆరో రోజున కరోనా నెగటివ్ తేలింది. కాబట్టి హోమియోపతి మందులను కరోనా నియంత్రణకు వాడేందుకు ఇదే మంచి సమయమని.. ఈ మందుతో కరోనా నుంచి వేలాది మంది మరణాలను నియంత్రించవచ్చునని హోమియోపతి వైద్యులు చెప్తున్నారు.
Arsenicum alb 30 అనే మందును ఇప్పటికే తమిళనాడులో పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు, కోయంబేడులో పనిచేసేవారికి, మీడియా ప్రతినిధులకు ఇవ్వడం జరిగిందని హోమియోపతి వైద్యులు మీడియాతో అన్నారు. ఈ మందు కొత్తేమీ కాదని 200 సంవత్సరాలకు ముందే వుందని.. హోమియోపతికి తండ్రి క్రిస్టిన్ ఫ్రెడ్రిచ్ కాలం నుంచే కనిపెట్టారు.
ఈ మందును ప్రజలందరికీ ఇవ్వడం చేస్తే కరోనా నుంచి తప్పించుకోవచ్చునని వైద్యులు చెప్తున్నారు. ఈ మందును ఎలా వాడాలంటే.. ఈ మందు వాడకానికి చేతిని ఉపయోగించకూడదు. ఈ మందును తీసుకున్నాక అరగంటపాటు నీటిని.. వేరేదైనా ఆహారాన్ని తీసుకోకూడదు. ఆ తర్వాత ఒక మాసానికి, లేదా 15 రోజుల తర్వాత ఇలా పరగడుపున మూడు రోజుల పాటు మందును తీసుకుంటే కరోనాను పూర్తిగా నియంత్రించవచ్చు.
ఈ మందును సేవించడం ద్వారా తెల్ల రక్త కణాల సంఖ్య పెరుగుతుందని.. తద్వారా కరోనా సోకదని చెప్పారు. గుజరాత్‌తో ఈ మందును వినియోగించడం జరిగింది. జయంతి రవి ఐఏఎస్ నేతృత్వంలో 76 లక్షల 72వేల మంది ప్రజలకు ఈ మందును ఇచ్చారని.. వారికి ఇప్పటివరకు కరోనా సోకలేదనే విషయాన్ని కూడా ధ్రువీకరించినట్లు చెప్పారు.
ఏప్రిల్ 10 నుంచి ఈ ప్రయోగం జరిగిందని.. ఇంకా కరోనా బాధితులు 2625 మందికి ఈ Arsenicum alb 30 మందును ఇచ్చారని.. దీంతో 11 మంది మినహా అందరికీ నెగటివ్ అనే రిజల్ట్ వచ్చిందని తమిళనాడు హోమియోపతి అసోసియేషన్ వైద్యులు చెప్తున్నారు. ఈ మందును తమిళనాడుతో పాటు ఇతర రాష్ట్రాలు కూడా ప్రజలకు అందేలా చర్యలు తీసుకోవాలని హోమియోపతి అసోసియేషన్ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.