కరోనా వైరస్ కారణంగా ప్రపంచ దేశాలన్నీ వణికిపోతున్నాయి. మనదేశంలోనూ కోవిడ్ కేసులు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. అయితే కరోనా కారణంగా జనం భయపడాల్సిన అక్కర్లేదని న్యూట్రీషియన్లు అంటున్నారు.
ఆరోగ్యంగా వుండాలంటే.. కోవిడ్ సోకకుండా వుండాలంటే.. చౌకధరలో లభించే వ్యాధినిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని తీసుకుంటేనే సరిపోతుందని చెప్తున్నారు. చాలా తక్కువ ధరలో లభించే ఇమ్యూనిటీ బూస్టర్‌ను రోజు వారీ ఆహారంలో భాగం చేసుకుంటే కోవిడ్ ఇట్టే సోకకుండా పరారవుతుంది.
అందుకే రోజూ వేరు పల్లీ బర్భీని తమలపాకుతో కలిపి తీసుకుంటే వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. పల్లీల్లో పోషకాలు, తమలపాకులో కఫాన్ని పోగొట్టే లక్షణాలు పుష్కలంగా వున్నాయి. తద్వారా వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది.
ఎలా తీసుకోవాలంటే..? తమలపాకు కాడను తుంచి వేడినీటిలో కడిగేయాలి తర్వాత ఆ తమలపాకుతో పాటు బర్ఫీని కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి బలం చేకూరుతుంది. దీన్ని ఆహారానికి తర్వాత తీసుకోవచ్చు. రోజుకు రెండుసార్లు తీసుకోవచ్చు. ఈ రెండింటి కాంబినేషన్ రుచికరంగా వుంటుంది. పూర్వం తమలపాకును కఫంను తొలగించే మందుగా వాడివున్నారు.
తమలపాకు పెయిన్ కిల్లర్‌గానూ భేష్‌గా పనిచేస్తుంది. తమలపాకు, బర్ఫీని నాలుగేళ్ల చిన్నారి నుంచి పెద్దల వరకు తీసుకోవచ్చు. బర్ఫీల్లో క్యాల్షియం, ఐరన్, మినరల్స్, ఫాస్పరస్, విటమిన్లు పుష్కలంగా వున్నాయి. ఈ రెండింటిని కలిపి తీసుకోవడం ద్వారా శరీరానికి మల్టీ విటమిన్లు లభించినట్లవుతుంది. వరుసగా 10 రోజుల పాటు తీసుకుంటే వ్యాధినిరోధక శక్తినిపెంచుకోవచ్చు.
దీనిని తరచుగా తీసుకునే వారిలో జుట్టు రాలే సమస్య వుండదు. సైనస్, వీసింగ్ వుండే వారికి దివ్యౌషధంగా పనిచేస్తుంది. ఇంకా కరోనాలో SARI కండిషన్ అంటే Severe Acute Respiratory infection conditionలో వున్నవారు తీసుకుంటే మంచి ఫలితం వుంటుంది. 10రోజుల పాటు తమలపాకు, పల్లీ బర్ఫీని తీసుకోవడం ద్వారా వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది.