పెళ్ళిళ్లలో, శుభకార్యాలలో ప్రధానంగా ఉపయోగించే తమలపాకు వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. తలనొప్పితో బాధపడేవారు లేత తమలపాకును నుదుటిపై పెట్టుకుని విశ్రాంతి తీసుకుంటే తగ్గిపోతుంది. ఎముకలు పటిష్టంగా ఉండటానికి అవసరమైన కాల్షియంతో పాటు ఫోలిక్ యాసిడ్స్ తమలపాకులో సమృద్ధిగా ఉంది. రోగ నిరోధక శక్తిని పెంచే గుణం కూడా తమలపాకుకు ఉంటుంది.
వృద్ధాప్య చాయలు కనిపించకుండా ఉండాలంటే తరచుగా తమలపాకులు తినండి. వీటిలో ఎసెన్షియల్ ఆయిల్ అధికంగా ఉంటుంది. అది ఫంగస్ రాకుండా చూసుకుంటుంది. బోధకాలుతో బాధపడేవారు తమలపాకులో కొద్దిగా ఉప్పు వేసి దంచి నీటిలో కలుపుకుని సేవిస్తే త్వరగా ఉపశమనం కలుగుతుంది. అధిక బరువును తగ్గించేందుకు కూడా తమలపాకులు బాగా ఉపయోగపడతాయి.
రోజూ ఒక ఆకును కొన్ని మిరియాలతో కలపి తీసుకుంటే బరువు తగ్గొచ్చు. అది తిన్న వెంటనే చల్లని నీరు తాగాలి. తీవ్రమైన తలనొప్పితో బాధపడేవారు తమలపాకు రసాన్ని తీసి కొద్దిగా ముక్కులో వేసుకుంటే సమస్య వెంటనే తగ్గుతుంది. తలలో చుండ్రు పోవాలంటే తమలపాకులను మెత్తగా రుబ్బి దానిని తలకు పట్టించండి. కాసేపటి తర్వాత తలస్నానం చేయండి.
అలా తరచుగా చేస్తుంటే చుండ్రు తగ్గుముఖం పడుతుంది. అయితే సంతానం కోసం చూసేవారు తమలపాకు తొడిమను అస్సలు తినకండి, గర్భందాల్చలేకపోవచ్చు. మోకాళ్ల నొప్పులు తగ్గాలంటే తరచూ తమలపాకుల రసాన్ని తాగుతూ ఉండండి.