చావుబతుకుల్లో ఎమ్మార్వో హంతకుడు సురేష్, ఆసుపత్రి వైపు రాని బంధువులు

బుధవారం, 6 నవంబరు 2019 (20:50 IST)
తహశీల్దార్ విజయారెడ్డిపై పెట్రోల్ పోసి నిప్పంటించి సజీవ దహనానికి కారణమైన నిందితుడు సురేష్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. సురేష్‌కు డాక్టర్లు ఫ్లూయిడ్స్ ఎక్కిస్తున్నారు. పోలీసుల సంరక్షణలో ప్రస్తుతం సురేష్‌కు చికిత్స జరుగుతోంది. సురేష్‌కు ప్రస్తుతం మేల్ బర్నింగ్ వార్డులో చికిత్స జరుగుతోంది.
 
65 శాతం సురేష్‌ శరీరానికి కాలిన గాయాలు అయ్యాయి. మరో 72 గంటలు గడిస్తే తప్ప సురేష్‌ ఆరోగ్య పరిస్థితి గురించి చెప్పలేమంటున్నారు వైద్యులు. ఘటన జరిగిన తరువాత సురేష్‌ను ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా వైద్యులు మొదట ప్రాధమిక చికిత్స అందించి మేల్ బర్నింగ్ వార్డుకు తరలించారు. తల భాగంలో, ఛాతీ భాగంలో సురేష్‌కు తీవ్రంగా గాయాలైనట్లు వైద్యులు గుర్తించారు. అయితే సురేష్‌ను చూడటానికి ఇప్పటివరకు బంధువులెవరూ రాలేదట.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం మరో 30 యేళ్లు జగన్ సీఎంగా వుండాలి: రమణ దీక్షితులు