Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తహసీల్దార్‌తో మాట్లాడతానని వెళ్లి.. పెట్రోల్ పోసి నిప్పంటించాడు..

Advertiesment
తహసీల్దార్‌తో మాట్లాడతానని వెళ్లి.. పెట్రోల్ పోసి నిప్పంటించాడు..
, సోమవారం, 4 నవంబరు 2019 (15:20 IST)
రంగారెడ్డి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. మహిళా తహసీల్దార్ విజయారెడ్డిపై దుండగులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ ఘటనలో విజయారెడ్డి తీవ్రగాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనకు పాల్పడిన దుండగులు పోలీసుల ముందు లొంగిపోయారు. ఇకపోతే ఈ ఘటనలో గాయాలపాలైనవారిని చికిత్స నిమిత్తం ఆస్సత్రికి తరలించారు. 
 
సోమవారం మధ్యాహ్నం 1:30 గంటలకు విజయారెడ్డితో మాట్లాడాలని ఓ వ్యక్తి ఆఫీసులోపలికి వెళ్లాడు. అరగంటపాటు చర్చించారు. అనంతరం ఒంటిపై మంటలతో విజయారెడ్డి బయటకు వచ్చారు. దీంతో అక్కడ ఉన్న సిబ్బంది ఆమెను కాపాడే ప్రయత్నం చేశారు. కానీ తీవ్రగాయాలపాలై ఆమె తహశీల్దార్ కార్యాలయంలోనే మృతిచెందారు.
 
కాగా అబ్ధుల్లాపూర్‌మెట్ మండలం ఏర్పడిన తర్వాత విజయా రెడ్డి తొలి తహసీల్దార్‌గా నియమితులయ్యారు. ఈ ఘటన భూవివాదమే కారణమై వుంటుందని పోలీసులు భావిస్తున్నారు. విజయారెడ్డిపై పెట్రోల్ పోసి నిప్పంటి.. నిందితుడు కూడా తనకు తాను నిప్పంటించుకున్నాడు. ఈ ఘటనలో నిందితుడు కూడా కాలిన గాయాలతో ఉండటంతో సమీపంలోని ఏదైనా ఆస్పత్రికి వెళ్లి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఢిల్లీలో సరిబేసి విధానం : బీజేపీ నేతకు ఫైన్ - సైకిల్‌పై ఉపముఖ్యమంత్రి