హైదరాబాద్‍‌లో దారుణం.. ఆఫీసులోనే మహిళా తాహశీల్దారు సజీవదహనం

సోమవారం, 4 నవంబరు 2019 (14:49 IST)
హైదరాబాద్ నగరం నడిబొడ్డున దారణం జరిగింది. పట్టపగలు పది మంది చూస్తుండగానే ఆఫీసులో మహిళా తాహశీల్దారును సజీవదహనం చేశాడో దుర్మార్గుడు. ఆ తర్వాత తాను కూడా నిప్పంటించుకుని తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి. 
 
సోమవారం వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్ నగరంలోని అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దారు కార్యాలయంలో ఓ మహిళ తాహశీల్దారుగా పని చేస్తున్నారు. సోమవారం ఉదయం కార్యాలయంలోకి ప్రవేశించిన దుండగుడు ఆమెపై కిరోసిన్ పోసి, నిప్పటించి సజీవదహనం చేశాడు. 
 
ఆ తర్వాత తనపై కూడా కూడా కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఈ ఘటనలో ఆఫీసులో పని చేస్తున్న ఇద్దరు సిబ్బంది కూడా గాయపడ్డారు. జరిగిన ఘటనతో ఆ ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి. ఈ దుండగుడు ఇలాంటి కిరాతక చర్యకు ఎందుకు పాల్పడ్డాడో తెలియడం లేదు. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం స్మార్ట్ ఫోన్‌లో మాట్లాడుతూ.. కొడుకును వదిలేసింది.. చివరికి ఏమైందంటే? (Video)