Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కాబోయే అల్లుడితో అత్త రొమాన్స్.. స్వయంగా పట్టుకున్న కుమార్తె

Advertiesment
కాబోయే అల్లుడితో అత్త రొమాన్స్.. స్వయంగా పట్టుకున్న కుమార్తె
, ఆదివారం, 3 నవంబరు 2019 (12:32 IST)
కాబోయే అల్లుడితో అత్త రొమాన్స్ చేస్తూ స్వయంగా కుమార్తెకు పట్టుబడింది. ఈ ఘటన జార్ఖండ్ రాష్ట్రంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, భర్త చనిపోయిన ఓ మహిళ తన కుమారుడు, కుమార్తెతో కలిసి స్థానికంగా నివసిస్తోంది. డిగ్రీ చదువుతున్న ఆమె కుమార్తె ఓ యువకుడితో ప్రేమలో పడింది. విషయం తెలిసిన తల్లి వారి పెళ్లికి అంగీకరించింది.
 
తమ పెళ్లికి లైన్ క్లియర్ కావడంతో యువకుడు తరచూ ప్రేయసి ఇంటికి వచ్చేవాడు. ఈ క్రమంలో ప్రేయసి తల్లితో ఏర్పడిన చనువు ఆపై వివాహేతర సంబంధానికి దారితీసింది. తాను లేని సమయంలో ప్రియుడు ఇంటికి వచ్చి పోతుండడాన్ని యువతి అనుమానించింది. అతడిపై నిఘా పెట్టింది.
 
ఓ రోజు కాలేజీ నుంచి ఇంటి కొచ్చిన ఆమెకు బయట ప్రియుడి చెప్పులు కనిపించాయి. లోపలికి తొంగిచూస్తే తన తల్లి, ప్రియుడు సన్నిహితంగా కనిపించారు. దీంతో విస్తుపోయిన ఆమె.. యువకుడి కుటుంబ సభ్యులతోపాటు స్థానికులను అప్రమత్తం చేసి వారిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఒక్క సీటుతో బీజేపీ ప్రభుత్వం కూలిన సందర్భం ఉంది : రాజ్‌ఠాక్రే