Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Tuesday, 29 April 2025
webdunia

రొమ్ము కేన్సర్, హైదరాబాద్ మహిళల్లో అవగాహన ఎంత?

Advertiesment
awareness
, గురువారం, 31 అక్టోబరు 2019 (22:02 IST)
హైదరాబాద్ : భారత మహిళల్లో రొమ్ము క్యాన్సర్ పట్ల గల అవగాహనను అర్థం చేసుకోవడమే లక్ష్యంగా జాతీయ సర్వే యొక్క ఫలితాలను, ఫ్యూచర్ జెనరేలీ ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ (ఎఫ్జిఐఎల్ఐ), మామ్స్ప్రెస్సోతో కలిసి ఒక జాతీయ సర్వే ఫలితాలను ఆవిష్కరించింది. రొమ్ము క్యాన్సర్ ప్రస్తుతం భారతదేశంలో మహిళలను ప్రభావితం చేసే క్యాన్సర్లలో ఒకటి. వాస్తవానికి, భారతదేశంలో నమోదైన మహిళా క్యాన్సర్ కేసులలో నాలుగవ వంతు రొమ్ము క్యాన్సర్‌కు సంబంధించినవే. 
 
రొమ్ము క్యాన్సర్ అవగాహన నెల (బిసిఎఎం) సందర్భంగా, ఫ్యూచర్ జనరేలీ భారతదేశం లైఫ్ ఇన్సూరెన్స్ & మహిళల కోసం భారతదేశపు అతిపెద్ద వినియోగదారు-ఉత్పత్తి విషయాంశ వేదిక అయిన, మామ్స్ప్రెస్సో, మహిళల్లో సంభాషణలను ప్రోత్సహించడానికి మరియు రొమ్ము క్యాన్సరుతో సంబంధం ఉన్న లక్షణాల పట్ల అవగాహన పెంచడానికి ఒక సర్వే నిర్వహించింది. రొమ్ము క్యాన్సరుతో సంబంధం ఉన్న రొమ్ములలో గడ్డలు మరియు రొమ్ములు గట్టిపడటం వంటి అసాధారణ లక్షణాల గురించి మహిళలు తెలుసుకోవడం చాలా అవసరం మరియు సరియైన మూల్యాంకనం మరియు ముందస్తుగా గుర్తించడం అనేవి, ఫలితాన్ని మెరుగుపరుస్తుందని అర్థం చేసుకోవడం చాలా అవసరం.
 
హైదరాబాదులో రొమ్ము క్యాన్సర్ పట్ల అధిక అవగాహన
భారతదేశంలో రొమ్ము క్యాన్సర్ సంభావ్యత అరుదేమీ కాదు. హైదరాబాదులో దాదాపు 85% మంది మహిళలకు రొమ్ము క్యాన్సర్ ఉందని, బాగా తెలుసు. ఆశ్చర్యకరంగా, నగరంలో 62% మహిళలు తమకు రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని భావించారు. అయినప్పటికీ, అధిక అవగాహన ఉన్నప్పటికీ, స్క్రీనింగ్ కోసం వెళ్ళే మహిళల సంఖ్య తక్కువగా ఉండటం బాధాకరం.
 
రొమ్ము పరీక్షకు ప్రాముఖ్యత ఇవ్వకపోవడం
రొమ్ము క్యాన్సర్ అవగాహన సర్వే ఫలితాల ప్రకారం, 28% మంది తమకు స్క్రీనింగ్ అవసరం లేదని భావించగా, 40% మంది రొమ్ము క్యాన్సర్ కోసం స్క్రీనింగ్ పరీక్షల ఉనికి గురించి తమకు తెలియదని వెల్లడించారు. అదనంగా, 25% మంది,  తాము పరీక్షలు చేయించుకోవడానికి బద్ధకం అని లేదా తమ వయస్సు చాలా చిన్నదని భావించారు.
 
రొమ్ము క్యాన్సర్ పరీక్ష మరియు చికిత్సపై పరిజ్ఞానం లేకపోవడం 
దేశవ్యాప్తంగా సగం మందికి పైగా, ఈ వ్యాధికి, ఏవయస్సు నుండి క్రమం తప్పకుండా పరీక్షలు చేయడం ప్రారంభించవచ్చో తెలియదు. సుమారు 70% మందికి, క్యాన్సర్ కోసం అందుబాటులో ఉన్న, వివిధ రకాల చికిత్సల గురించి తెలియదు. వాస్తవానికి, చాలామందికి గుర్తుకువచ్చేది కీమోథెరపీ మాత్రమే.  
 
వ్యాధికి ఒక ముఖ్యమైన స్క్రీనింగ్ టెస్ట్‌గా స్వీయ పరీక్ష గురించి దక్షిణ భారతదేశంలో మహిళలకు స్వీయ పరీక్ష గురించి తక్కువ అవగాహన ఉందని సర్వే వెల్లడించింది. నిజానికి, హైదరాబాద్‌లో కేవలం 34% మహిళలకు మాత్రమే ఈ పద్ధతి గురించి తెలుసు. ఇంకా, హైదరాబాదులో 38% మంది మహిళలకు మామోగ్రాఫ్ అంటే ఒక చికిత్సా ఎంపికగా తెలుసు, 54% మందికి కెమోథెరపీ గురించి మాత్రమే తెలుసు.
 
హైదరాబాదులో దాదాపు 9% మంది రొమ్ము క్యాన్సరుతో బాధపడుతున్నారని లేదా ఇదివరకే బాధపడ్డారని, ఈ అధ్యయనంలో తేలింది. ఇందులో, ఈ రొమ్ము క్యాన్సర్‌తో పోరాడుతున్నవారిలో, రొమ్ములలో నొప్పి మరియు అసౌకర్యం, రొమ్ములు మరియు రొమ్ముల లోపల గడ్డలు, మరియు వాటి ఆకారం మరియు పరిమాణంలో మార్పులను, వ్యాధి యొక్క సాధారణంగా అనుభవించగల మొదటి 3 లక్షణాలుగా పేర్కొంది.
 
రొమ్ము క్యాన్సర్ గురించి మాట్లాడాన్ని మహిళలు అసౌకర్యంగా భావిస్తారు
రొమ్ము క్యాన్సర్ మరియు దానికి సంబంధించిన చికిత్సలు పట్ల అవగాహన లేకపోవడం అనే ముఖ్యమైన కారణాన్ని అన్‌కవర్ చేస్తూ, ఒక సర్వేలో, భారతదేశంలో సుమారుగా 52% మంది మహిళలు తమ వ్యాధి గురించి తమ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో మాట్లాడడం అంత సౌకర్యవంతంగా భావించరని తెలిసిదింది. అయినప్పటికీ, హైదరాబాద్‌లో, కేవలం 48% మహిళలు ఈ వ్యాధి గురించి మాట్లాడటం సౌకర్యవంతంగా భావిస్తున్నారు. మెట్రో నగరాల్లో ఎక్కువమంది మహిళలు సంభాషణలు ప్రారంభించడానికి మరియు రొమ్ము క్యాన్సర్ గురించి అవగాహన కల్పించడానికి సిద్ధంగా ఉన్నారని ఇది సూచిస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాత్రిపూట లోదుస్తులు లేకుండా నిద్రపోతే ఎన్ని ఉపయోగాలో తెలుసా?