చాలామంది రాత్రిపూట కూడా శరీరాన్ని ఫుల్లుగా కప్పేసే బట్టలు వేసుకుని పడుకుంటారు. దానికితోడు అండర్‌వేర్లు కూడా వేసుకుని నిద్రిస్తారు. అయితే అలా నిద్రించడం మంచిది కాదంటున్నారు వైద్య నిపుణులు. అసలు అండర్వేర్ లేకుండా నిద్రిస్తే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయంటున్నారు.
సాధారణంగా విదేశీయులు అండర్వేర్ లేకుండానే నిద్రిస్తారట. అలా నిద్రించడం వల్ల శరీరంలోని హార్మోన్లన్నీ సక్రమంగా పనిచేస్తాయని వైద్యులు చెబుతున్నారు. అలాగే శరీరానికి సరిగ్గా గాలి తగులుతుందని.. జీర్ణక్రియ బాగా పనిచేస్తుందంటున్నారు. వృద్ధాప్య ఛాయలు అంత త్వరగా దరిచేరవని.. యంగ్‌గా కనిపిస్తారని చెబుతున్నారు.
శరీరానికి రిలాక్స్ ఫీలింగ్ కనిపిస్తుందని.. జననావయాలు తమ విధులు సక్రమంగా నిర్వహిస్తాయంటున్నారు. మహిళలకైతే ఈస్ట్ ఫంగస్ ఇన్షెక్సన్ రాదని.. పురుషుల్లో లైంగిక సామర్థ్యం బాగా పెరుగుతుందంటున్నారు. సంతానం పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని, మనస్సుకు ప్రశాంతత కూడా కలుగుతుందంటున్నారు. ఒత్తిడిని కలిగించే హార్మోన్లు మాయమై.. నిద్రలేమితో బాధపడేవారు అండర్వేర్ లేకుండా నిద్రపోతే ఇంకా మంచిదంటున్నారు వైద్య నిపుణులు.