Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో మళ్లీ కరోనా విజృంభణ : కొత్తగా 10 వేల పాజిటివ్ కేసులు

Webdunia
శనివారం, 22 ఆగస్టు 2020 (19:00 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్లీ కరోనా వైరస్ విజృభించింది. నిన్నామొన్నటివరకు పదివేల లోపు నమోదైన ఈ కేసుల సంఖ్య శనివారం పదివేలు దాటిపోయాయి. గత 24 గంటల్లో కొత్తగా 10,276 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో తూర్పుగోదావరి జిల్లాలో 1321, చిత్తూరులో 1220, పశ్చిమగోదావరిలో 1033, అనంతపురం జిల్లాలో 1020 కొత్త కేసులు నమోదయ్యాయి. 
 
దీంతో, ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్య 3,45,216కి పెరిగింది. మరోవైపు గత 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 97 మంది కరోనా బారిన పడి మరణించారు. దీంతో, ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 3,189కి పెరిగింది. గత 24 గంటల్లో 61,469 మంది శాంపిల్స్ పరీక్షించారు. మరోవైపు 24 గంటల్లో 8,593 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.
 
శాంతించని కరోనా.. తెలంగాణాలో లక్ష క్రాస్ 
దేశంలో కరోనా వైరస్ ఏమాత్రం శాంతించడం లేదు. దేశంలో కొత్తగా మరో 69878 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో ఈ కేసులు నమోదయ్యాయి. అలాగే, 945 మంది మృతి చెందారని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.
 
దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 29,75,702కు చేరగా, మృతుల సంఖ్య మొత్తం 55,794కి పెరిగింది. ఇక 6,97,330 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 22,22,578 మంది కోలుకున్నారు.
 
కాగా, నిన్నటి వరకు మొత్తం 3,44,91,073 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులోనే 10,23,836 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది. 
 
మరోవైపు, తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసులు లక్ష దాటాయి. కొత్తగా 2,474  మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయిందని తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ శనివారం వెల్లడించింది. అదేసమయంలో ఏడుగురు కరోనాతో ప్రాణాలు కోల్పోగా, 1,768 మంది కోలుకున్నారు.
 
ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,01,865కి చేరింది. ఆసుపత్రుల్లో 22,386 మందికి చికిత్స అందుతోంది. ఇప్పటివరకు 78,735 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 744కి చేరింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో 447 మందికి కొత్తగా కరోనా సోకింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో సింగర్ అవసరమే లేదు : సింగర్ రమణ గోగుల

అల్లు అర్జున్ సేఫ్‌గా బయటపడేందుకు చిరంజీవి మాస్టర్ స్కెచ్ ?

జనవరి 1 న విడుదల కానున్న క్రావెన్: ది హంటర్

బచ్చల మల్లి పదేళ్ళ పాటు గుర్తుండిపోయే సినిమా : అల్లరి నరేష్

మనోజ్ ఫిర్యాదులో నిజం లేదు .. మంచు విష్ణు గొడవ చేయలేదు : తల్లి నిర్మల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్త్రీలకు ఎడమ వైపు పొత్తికడుపు నొప్పి, తగ్గేందుకు ఇంటి చిట్కాలు

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

ట్రెండ్స్ సీజన్ క్లోజింగ్ సేల్, ప్రత్యేకమైన తగ్గింపు ఆఫర్‌లు

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments