Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఈ జీవితం నాకొద్దు... భవనంపై నుంచి దూకి కరోనా రోగి ఆత్మహత్య

Advertiesment
ఈ జీవితం నాకొద్దు... భవనంపై నుంచి దూకి కరోనా రోగి ఆత్మహత్య
, శుక్రవారం, 21 ఆగస్టు 2020 (11:26 IST)
కరోనా వైరస్ చేసే హాని కంటే.. ఆ వైరస్ సోకిదన్న భయంతోనే అనేక మంది మృత్యువాతపడుతున్నారు. తాజాగా ఓ కరోనా రోగి ఆస్పత్రి భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర సంఘటన ఈస్ట్ గోదావరి జిల్లా రాజమండ్రిలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జిల్లాలోని దుమ్మలోవ అనే గ్రామనికి చెందిన ఓ వ్యక్తి ఈ నెల 18వ తేదీన కరోనా లక్షణాలతో ఆస్పత్రిలో చేరారు. అప్పటి నుంచి చికిత్స పొందుతూ వచ్చిన ఆ వ్యక్తి.. గురువారం ఉన్నట్టుండి ఆస్పత్రిలోని నాలుగో అంతస్తు నుంచి కిందకు దూకడంతో ప్రాణాలు కోల్పోయాడు. 
 
ఈ ఘటన జిల్లాలోని రాజానగరం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. అయితే, ఈ విషయం తెలిసిన మృతుని బంధువులు ఆస్పత్రి ఎదుట ధర్నాకు దిగారు. ఆస్పత్రిలో చికిత్స అందించక పోవడం వల్లే ఈ దారుణానికి పాల్పడ్డారని పేర్కొంటూ, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సారా అలీఖాన్‌ ప్రేమలో సుశాంత్‌?.. బయట పెట్టిన స్నేహితుడు