దేశ మొత్తంలో కరోనా ఉగ్రరూపం దాలుస్తున్న సందర్భంగా ఢిల్లీ సిఎం కేజ్రవాల్ ప్లాస్మా దానం చెయ్యాలని కోరారు. ఈరోజు ఉదయం (గురువారం) వీడియో కాన్పరెన్స్ ద్వారా మొట్టమొదటిసారిగా ప్లాస్మా బ్యాంకును స్థాపించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కరోనావైరస్ నుండి కోలుకున్న వారు ప్లాస్మా దానం చెయ్యాలని కోరారు.
ప్లాస్మా దానం చెయ్యాలనుకునేవారు 1031 నంబర్‌కు ఫోన్ కాల్ ద్వారా గానీ, 8800007722 నెంబర్‌కు వాట్సాప్ ద్వారా గానీ సమాచారం అందిచాలని కోరారు.
అయితే ప్లాస్మా దానం చేయాలనుకునేవారి వయసు 18 ఏండ్లకు తగ్గకుండా 60 ఏండ్లకు మించకుండా ఉండాలని బరువు 50 కేజీలకు తగ్గకుండా ఉండాలని స్పష్టం చేసారు. బాలింతలు, బీపీ, షుగర్ ఉన్న వారు అనర్హులని పేర్కొన్నారు.