Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కరోనా వైరస్ నుంచి బయటపడిన ఎంజీ సీఎం రమేష్

కరోనా వైరస్ నుంచి బయటపడిన ఎంజీ సీఎం రమేష్
, శుక్రవారం, 21 ఆగస్టు 2020 (13:54 IST)
భారతీయ జనతా పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ తిరిగి కోలుకున్నారు. ఆయన రెండు వారాల క్రితం కరోనా వైరస్ బారినపడిన విషయంతెల్సిందే. అప్పటి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వచ్చిన సీఎం రమేష్... తాజాగా ఈ వైరస్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. తాజాగా ఆయనకు నిర్వహించిన కరోనా పరీక్షల్లో నెగెటివ్ అని వచ్చింది. 
 
ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. "దేవుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నా క్షేమం కోసం ప్రార్థించిన వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. కరోనాపై నా పోరాటంలో సహకరించిన డాక్టర్లకు, ఇతర వైద్య సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు. త్వరలోనే నా కార్యక్రమాలు కొనసాగిస్తాను" అని వెల్లడించారు. 
 
మరోవైపు, దేశంలో కొవిడ్‌-19 కేసుల ఉద్ధృతి కొనసాగుతోంది. గత 24 గంటల్లో 68,898 మందికి కరోనా సోకిందని, అదేసమయంలో 983 మంది మృతి చెందారని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.
     
దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 29,05,824కు చేరగా, మృతుల సంఖ్య మొత్తం 54,849కి పెరిగింది. ఇక 6,92,028 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 21,58,947 మంది కోలుకున్నారు.
 
కాగా, నిన్నటి వరకు మొత్తం 3,34,67,237 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. గురువారం ఒక్కరోజులోనే 8,05,985 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రపంచ సీనియర్ సిటిజన్స్ డే: ప్రతి అవ్వకూ, ప్రతి తాతకూ...