Webdunia - Bharat's app for daily news and videos

Install App

టెస్టు చేయకుండానే కరోనా పాజిటివ్ : ఇది ఏందిరా బాబు

Webdunia
మంగళవారం, 21 జులై 2020 (12:26 IST)
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని గ్రీన్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో సోమవారం కరోనా పరీక్షలు నిర్వహించారు. అయితే పట్టణ ప్రజలతో పాటు ఫరూఖ్ నగర్ మండల పరిధిలోని పలు గ్రామాల నుంచి ప్రజలు స్వచ్చందంగా కరోనా పరీక్షలు చేయించుకునేందుకు ఫంక్షన్ హాల్‌కి బారులు తీరారు.
 
ఈ నేపథ్యంలో ఫరూఖ్ నగర్ మండల పరిధిలోని చిల్కమర్రి గ్రామానికి చెందిన ఓ మహిళ కరోనా పరీక్షల కోసం అక్కడికి చేరుకుంది. క్యూలైన్ పెద్దగా ఉండటంతో చివరి వరకు లైన్లోనే ఉండింది. తన వరకు వచ్చేసరికి కరోనా పరీక్షల కిట్స్ అయిపోయాయని, రేపు రావాలని సిబ్బంది చెప్పడంతో చేసేది లేక ఇంటి ముఖం పట్టింది.
 
కానీ సాయంత్రానికి ఇంటికి చేరుకున్న ఆ మహిళకు సిబ్బంది నీకు పాజిటివ్ వచ్చిందని చెప్పడంతో బిత్తరపోయిoది. సోమవారం సుమారు రెండు వందల మందికి పైగా కరోనా పరీక్షలు చేయగా సుమారు 48 మందికి పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అయితే 50 మందిలో చిలకమర్రి గ్రామానికి చెందిన మహిళ పేరు ఉండటం సిబ్బంది నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది.
 
అసలు ఆ మహిళకు పరీక్షలు నిర్వహించకుండా కరోనా పాజిటివ్ అని ఎలా నిర్ధారించారో ఆ దేవుడికే తెలియాలి. ఇప్పటికే షాద్ నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా 240 పాజిటివ్ కేసులు నమోదు కాగా 8 మంది మృతి చెందారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

తర్వాతి కథనం
Show comments