చిత్తూరు జిల్లాను కరోనా వైరస్ వణికిస్తోంది. ఆ మధ్య చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తిలో కరోనా సమయంలో భారీ ర్యాలీ నిర్వహిస్తే విపరీతమైన కేసులు రావడం.. ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డిపై ప్రతిపక్షాలు విమర్సలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ తరువాత శ్రీకాళహస్తిలో కేసుల సంఖ్య బాగా పెరిగాయి.
కొన్నిరోజుల పాటు సైలెంట్‌గా ఉన్న వైసిపి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ఆ తరువాత అడపాదడపా మళ్ళీ కొన్ని కార్యక్రమాలు చేశారు. మొదట్లో మాస్క్ వేసుకోకుండా కొన్ని కార్యక్రమాలు చేసిన బియ్యపు మధుసూదన్ రెడ్డి ఆ తరువాత మాస్క్ వేసుకోవడం ప్రారంభించారు.
కానీ మూడురోజుల క్రితం ఎమ్మెల్యేతో పాటు ఆయన సతీమణి ఇద్దరూ కలిసి కరోనా పరీక్షలు చేయించుకున్నారు. ఈ టెస్టులో ఇద్దరికీ పాజిటివ్ వచ్చింది. దీంతో ఇద్దరూ స్థానికంగా ఉన్న ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేరారు. అధికార పార్టీ ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు కరోనా రావడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది.