30 ఇయర్స్ ఇండస్ట్రీ.. ఈ డైలాగ్ వెంటనే గుర్తుకు వస్తారు ఫృథ్వీ. ఈయన గురించి అస్సలు చెప్పనవసరం లేదు. వైసిపి అధికారంలోకి రాకముందు జగన్మోహన్ రెడ్డికి బాగా క్లోజ్‌గా మెలిగారు. ఆ సన్నిహితంతోనే ఏకంగా ఎస్వీబీసీ ఛైర్మన్ పదవిని అప్పగించారు. వేంకటేశ్వర భక్తి ఛానల్లో కీలక పదవి.
అలాంటి పదవిలో చాలా తక్కువ రోజులు కొనసాగిన పృథ్వీ ఆ తరువాత వేధింపుల విమర్శలతో పదవికే రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది అందరికీ తెలిసిన విషయమే. చివరకు ఫృథ్వీకి ఇంకెలాంటి పదవులు ఉండవని అందరూ అనుకున్నారు. టిటిడి లాంటి సంస్థలో పనిచేసి చెడ్డపేరు తెచ్చుకున్న ఫృథ్వీ ఇక వైసిపి అధికారంలో ఉన్నంత వరకు ఎలాంటి పదవులు ఇవ్వరని అందరూ అనుకున్నారు.
కానీ ఫృథ్వీ మాత్రం ఏకంగా ఎంపి సీటుపైనే దృష్టి పెట్టారు. నర్సాపురం ఎంపి రఘురామక్రిష్ణమరాజు వ్యవహారం వైసిపిలో పెద్ద గందరగోళం నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆ సీటు ఖాళీ అవుతుందనీ, ఆ సీటుకు తన పేరు ఖరారు చేయాలని తనకున్న పరిచయాలతో ట్రై చేసుకుంటున్నాడట ఫృథ్వీ.
నర్సాపురంలో నన్ను నిలబెడితే భారీ మెజారిటీతో గెలుపొందుతానని ధీమాతో చెబుతున్నాడట. అయితే వైసిపి అధినాయకులు మాత్రం దీనిపై అస్సలు పట్టించుకోవడం లేదట. కానీ ఫృథ్వీ మాత్రం పట్టువదలని విక్రమార్కుడిలా తన ప్రయత్నం మాత్రం ఆపడం లేదట. ఏం జరుగుతుందో మరి.