తెలంగాణ తగ్గినట్టే తగ్గి పెరిగిపోతున్నాయ్.. 24 గంటల్లో 42,740 కేసులు

Webdunia
మంగళవారం, 24 నవంబరు 2020 (10:35 IST)
తెలంగాణలో కరోనా కేసులు తగ్గినట్టే తగ్గి తిరిగి పెరుగుతున్నాయి. సోమవారం 600 దాటిన పాజిటివ్ కేసులు.. ఇవాళ 900 వందలు దాటాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 42,740 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, 921 పాజిటివ్‌ కేసులుగా తేలాయి. 
 
తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు 2,65,049కి చేరుకుంది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్‌ విడుదల చేసింది. ఇక అటు కరోనాతో మరో నలుగురు మృతి చెందారు. దీంతో కరోనా మృతుల సంఖ్య 1,437కి చేరింది. 
 
సోమవారం కరోనాబారి నుంచి 1,097 మంది కోలుకున్నారు. దీంతో కోలుకున్న వారి సంఖ్య 2,52,565కి చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 11,047 యాక్టివ్‌ కేసులు ఉండగా, వారిలో 8,720 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నట్టుగా వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇక రాష్ట్రంలో కరోనా నిర్థారణ పరీక్షల సంఖ్య 52,01,214కి చేరుకుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హైదరాబాద్‌లో సరికొత్త ఫార్మెట్ లో ఐమాక్స్ స్క్రీన్ : సునీల్ నారంగ్

Sandigdham Review: మిస్టరీ, థ్రిల్లింగ్ కథతో నిహాల్, ప్రియా దేశ్‌పాగ్ చిత్రం సందిగ్ధం మూవీ రివ్యూ

Sanjay Rao: హిట్ అండ్ రన్ ఫస్ట్ లుక్ తో సంజయ్ రావ్ క్రేజ్

మహేష్ బాబు అతిథి 4K థియేటర్లలో పాలాబిషేకంతో అభిమానుల సందడి

Sandeep Reddy Vanga: సందీప్ రెడ్డి వంగా చిత్రానికి రోమాంచకం టైటిల్ ఖరారు

తర్వాతి కథనం
Show comments