పాలు విరిపోతాయనుకుంటే..?

Webdunia
శుక్రవారం, 22 మార్చి 2019 (12:44 IST)
నేటి తరుణంలో పనులన్నీ చకచగా జరిగిపోతున్నాయి. కానీ, వంట విషయానికి వస్తే మాత్రం అది సాధ్యం కానంటుంది. ప్రతిరోజూ ఆఫీసుకు వెళ్లే స్త్రీలు చిన్న చిన్న వంటింటి చిట్కాలు మర్చిపోతున్నారు. అంతేకాదు.. అన్నీ పనులు అవసరవసరంగా చేస్తున్నారు. ఇలా చేయడం వలన వారి వంట తినడానికి వారికే విసుగుగా అనిపిస్తుంది. అలాంటివారి కోసం ఈ చిన్నపాటి చిట్కాలు..
 
1. ఇంటికి అతిథులు వచ్చారు.. అన్నీ ఆహారాలు పదార్థాలు వడ్డించారు కానీ.. సమయానికి మజ్జిగ సరిపోదని అనుమాసం వచ్చిందంటే.. అప్పుడు కాసిన్ని గోరువెచ్చని పాలలో చిటికెడు ఉప్పు వేసి నిమ్మరసం పిండేతే మజ్జిగలా తయారవుతుంది.
 
2. ఇక పులిహోర చేసేటప్పుడు అన్నం పొడిపొడిగా రావాలంటే.. అన్నం ఉడికేటప్పుడు అందులో కొన్ని చుక్కల నిమ్మరసం, స్పూన్ నూనె వేస్తే సరిపోతుంది.
 
3. ఒక్కోసారి కూరల్లో ఉప్పు ఎక్కువైపోతుంది.. అలాంటప్పుడు కంగారు పడకుండా.. 2 స్పూన్ల పాలమీగడ కలిపితే ఉప్పుదనం కాస్త తగ్గుతుంది. దాంతోపాటు టేస్ట్ కూడా బాగుంటుంది.
 
4. క్యాబేబీ, కాలీఫ్లవర్ ఉడికించుకునేటప్పుడు వాసన వస్తాయి. ఆ వాసన రాకుండా ఉండాలంటే.. బ్రెడ్ ముక్క లేదా కొద్దిగా చక్కెర వేస్తే వాసన రాదు. 
 
5. నెయ్యి కాచి దించేముందు దానిలో కొన్ని మెంతులు లేదా తమలపాకు వేస్తే సువాసనగా ఉంటుంది. అలానే నెయ్యి ఎక్కువకాలం పాటు నిల్వ ఉంటుంది.
 
6. పాలు విరిపోతాయనుకుంటే.. కాచేటప్పుడు అందులో కొద్దిగా వంటసోడా వేస్తే సరిపోతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

కల్తీ నెయ్యి కేసు: తితిదే జీఎం కె సుబ్రహ్మణ్యం అరెస్ట్, వైవీ సుబ్బారెడ్డిని కూడానా?

సైక్లోన్ దిత్వా వచ్చేస్తోంది.. తమిళనాడులో భారీ వర్షాలు.. శనివారం నాటికి..

కేటీఆర్ ఐరన్ లెగ్.. అందుకే కవిత పార్టీ నుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది.. కడియం శ్రీహరి

మైండ్‌లెస్ మాటలు మాట్లాడేవారు ఉపముఖ్యమంత్రులవుతున్నారు: జగదీష్ రెడ్డి (video)

ఆరోగ్యానికే కాదు.. పెళ్ళిళ్లకు కూడా ఇన్సూరెన్స్.... ఎట్టెట్టా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వేధింపులు ధైర్యంగా ఎదుర్కోండి.. మహిళలకు ఐష్ పిలుపు

ఇకపై చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌కు విదేశీ విరాళాలు

Naveen Polishetty : భీమవరం బల్మా గీతంతో గాయకుడిగా అదరగొట్టిన నవీన్‌ పొలిశెట్టి

Manoj: కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు : మంచు మనోజ్

అశ్విని దత్ ప్రజెంట్స్ లో జయకృష్ణ ఘట్టమనేని చిత్రం శ్రీనివాస మంగాపురం

తర్వాతి కథనం
Show comments