సాధారణంగా సరైన పద్ధతులలో, సరైన సౌందర్య చిట్కాలను వాడటం వలన చర్మాన్ని ఆరోగ్యవంతంగా ఉంచుకోవచ్చు. కొన్ని రకాల ఇంట్లో ఉండే సౌందర్య చిట్కాల ద్వారా ప్రకాశవంతమైన చర్మాన్ని పొందవచ్చు, వీటి వలన మీ చర్మ రక్షణ కుడా సులభతరం అవుతుంది. ఇంట్లో సహజంగా ఉండే సౌందర్య ఔషధాల ద్వారా మీ చర్మాన్ని మెరిసేలా చేసుకోవచ్చు మరియు వీటికి ఎక్కువ ఖర్చు చేయవలసిన అవసరం లేదు. ప్రకాశవంతమైన చర్మం కోసం కొన్ని రకాల సౌందర్య చిట్కాలేమిటో చూద్దాం.
1. చర్మసంరక్షణకు ముఖ్యంగా తేనే మొదటిది. చర్మానికి తేనె రాయటం వలన మంచి ఫలితాలను పొందవచ్చు. ఇది చర్మం పైన ఉండే మచ్చలకు, మొటిమలకు మంచి ఔషధంగా పనిచేస్తుంది. కారణం ఇది యాంటీ-బ్యాక్టీరియా గుణాలను కలిగి ఉంటుంది. అంతేకాకుండా, తేనే వలన చర్మం సున్నితంగా మారుతుంది.
2. దోసకాయల నుండి తయారుచేసిన రసాన్ని చర్మానికి వాడండి. దీని వలన వివిధ రకాల చర్మ సమస్యలు మరియు అలసిన కళ్ళకు ఉరట కలిగిస్తుంది. దోసకాయ రసాన్ని కళ్ళకు వాడటం వలన హైడ్రెటింగ్ భావనను పొందుతారు, కంటిచూపును కూడా మెరుగుపరుస్తుంది. దోసకాయ వలన కంటి కింద చర్మం పైన ఉండే నల్లటి వలయాలను కూడా తొలగిస్తుంది. నల్లటి మచ్చలను కలిగి ఉన్నవారు అయితే తాజా దోసకాయ రసాన్ని, కాటన్ లేదా పత్తిలో ముంచి నల్లటి వలయాల పైన 10 నుండి 15 నిమిషాల పాటు ఉంచండి. ఇలా కొన్ని రోజులు చేయటం వలన కొంత కాలం తరువాత మీ చర్మం పైన ఉండే మచ్చలు మాయమైపోతాయి.
3. టమోటా రసంతో ముఖాన్ని కడగటం వలన, సహజ సిద్ద మెరుపు పొందుతారు. పండును ఉడకబెట్టి, వచ్చిన రసాన్ని రసాన్ని చల్లబరచండి, దీనితో ముఖం కడగటం వలన మంచి ఫలితాలను పొందుతారు.
4. మీ చర్మం జిడ్డుగా ఉన్నట్లయితే చల్లటి మంచుగడ్డ కలిపిన పాలను ముఖానికి వాడండి. దీని వలన చర్మం పైన ఉండే నూనెలు తొలగిపోతాయి.