కోడిగుడ్డు ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతాకాదు. అలానే గుడ్డు పెంకులు కూడా కొన్ని అవసరాలకు పనికొస్తాయి. చీమలు, బొద్దింకలు బాగా తిరిగే చోట గుడ్డు పెంకులను ఉంచితే, వాటి బెడద తగ్గుతుంది.
గుడ్డు పెంకుల్లో మట్టి నింపి ధనియాలూ, ఆవాల గింజలు వేస్తే చిన్న మొక్కలు వస్తాయి. వీటిని గుడ్లు పెట్టుకునే అట్టలో పెట్టి బాల్కనీలో ఉంచితే చూడ్డానికి బాగుంటుంది.
ఇంట్లో పండ్లు, కూరగాయలు ఉంచినప్పుడు వాటి చుట్టూ పెంకుల పొడిని చల్లితే పురుగులూ, ఈగలూ రావు. గుమ్మం ముందున్న మొక్కలపై వీటిని చల్లితే చీడపీడలు పట్టవు.
వంటింటి గట్టుపై నూనె, పదార్థాలు తాలూకు మరకలు పడితే వెనిగర్‌లో పెంకుల పొడి కలిపి అక్కడ రాయాలి. కొద్దిసేపయ్యాక కొబ్బరి పీచుతో రుద్దితే మరకలు వదిలిపోతాయి.