Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో గ్రూపు-2 పరీక్షల తేదీల వెల్లడి

Webdunia
బుధవారం, 1 మార్చి 2023 (10:11 IST)
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూపు-2 పరీక్షలను నిర్వహించనుంది. తాజాగా ఈ పరీక్షల నిర్వహణ తేదీలను వెల్లడించింది. ఆగస్టు 29వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఈ రాత పరీక్షలు జరుగుతాయని టీఎస్‌పీఎస్సీ వెల్లడించింది. ఈ మేరకు టీఎస్‌పీఎస్‍సీ సెక్రెటర్ అనితా రామచంద్రన్ తెలిపారు. 
 
ఈ పరీక్షల్లో భాగంగా, ఆగస్టు 29వ తేదీన ఉదయం పేపర్-1 జనరల్, ఎబిలిటీస్, స్టడీస్, మధ్యాహ్నం పేపర్-2 చరిత్ర, రాజకీయం, సమాజం అంశాలకు సంబంధించిన పరీక్ష జరుగుతుంది. 30వ తేదీ ఉదయం పేపర్-3 కింద ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి, మధ్యాహ్నం పేపర్-4 కింద తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఆవిర్భావం అంశాలతో పరీక్షలు నిర్వహిస్తామని తెలిపింది. 
 
ఒక్కో పరీక్షకు మూడు గంటల సమయం కేటాయిస్తామని, ఒక్కో పేపర్‌కు 150 మార్కులు చొప్పున మొత్తం 600 మార్కులు ఉంటాయని వెల్లడించారు. పరీక్షా తేదీలకు వారం రోజుల ముందు నుంచే అడ్మిట్ కార్డులను https://tspsc.gov.in అనే వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. 
 
గ్రూపు-2 ఉద్యోగాలకు సంబంధించి 783 పోస్టుల కోసం గతయేడాది డిసెంబరు 29వ తేదీన టీఎస్పీఎస్పీ నోటిఫికేషన్ విడుదల చేయగా, జనవరి 18 నుంచి దరఖాస్తులను స్వీకరించింది. గ్రూపు-2 ఉద్యోగాల కోసం 5,51,943 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. చివరి మూడు రోజుల్లో ఏకంగా 1.10 లక్షల దరఖాస్తులు వచ్చాయి. అంటే ఒక్కో పోస్టుకు 705 మంది పోటీ పడుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sampoornesh: రాజమౌళి గారి పలకరింపే నాకు ధైర్యం : సంపూర్ణేష్ బాబు

Urvashi Rautela : దబిడి దిబిడి తర్వాత ఊర్వశి రౌతేలా సన్నీ డియోల్ జాట్ లో అలరిస్తోంది

Devara 2 : ఎన్.టి.ఆర్. దేవర సీక్వెల్ వుండదా?

విశ్వంభర లో కొత్తతరం హాస్యనటులతో మెగాస్టార్ చిరంజీవి

శ్రీ విష్ణు, కేతిక శర్మ, ఇవానా నటించిన #సింగిల్ ఫస్ట్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments