Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సమ్మర్‌కు మరో విజువల్ వండర్.. 11 భాషల్లో "హనుమాన్" రిలీజ్

Advertiesment
hanumaan
, సోమవారం, 9 జనవరి 2023 (15:38 IST)
వేసవిలో మరో విజువల్ వండర్ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రం పేరు "హనుమాన్". ఏకంగా 11 భాషల్లో తెరకెక్కింది. ప్రశాంత్ వర్మ దర్శకుడు. ఈయన సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తర్వాత "కల్కి", "జాంబిరెడ్డి" వంటి వరుస విభిన్న చిత్రాలతో గుర్తింపు పొందారు. ప్రస్తుతం యంగ్ హీరో తేజసజ్జాతో కలిసి "హనుమాన్" మూవీని తెరకెక్కించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను శరవేగంగా జరుపుకుంటుంది. ఇప్పటికే ఈ చిత్ర బృందం రిలీజ్ చేసిన పోస్టర్లు, టీజర్లు సినిమాపై విపరీతమైన అంచనాలను పెంచేసింది. 
 
తాజాగా చిత్రం విడుదల తేదీని ప్రకటించింది. సమ్మర్ కానుకగా మే 12వ తేదీన విడుదల చేయనున్నట్టు అధికారికంగా వెల్లడించింది. ఇందులో నాలుగు దక్షిణాది భాషలతో పాటు హిందీ, జపనీస్, ఇంగ్లీష్, స్పానిష్, కొరియన్, చైనీస్‌తో సహా ఇతర భాషలు కూడా ఉన్నాయి. ఒక తెలుగు చిత్రాన్ని ఇన్ని భాషల్లో రిలీజ్ చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. కంటెంట్ మీదున్న నమ్మకంతోనే ఈ సాహసం చేస్తున్నట్టు దర్శక నిర్మాతలు చెబుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కనులవిందు చేస్తున్న కమనీయ దృశ్యాలు.. "శాకుంతలం" ట్రైలర్ రిలీజ్