కనులవిందు చేస్తున్న కమనీయ దృశ్యాలు.. "శాకుంతలం" ట్రైలర్ రిలీజ్

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Saturday, 11 January 2025
webdunia

కనులవిందు చేస్తున్న కమనీయ దృశ్యాలు.. "శాకుంతలం" ట్రైలర్ రిలీజ్

Advertiesment
shaakuntalam movie
, సోమవారం, 9 జనవరి 2023 (13:37 IST)
హీరోయిన్ సమంత ప్రధాన పాత్రను పోషించిన చిత్రం "శాకుంతలం". గుణశేఖర్ దర్శకత్వం. ఈ చిత్రం ద్వారా మలయాళ నటుడు మోహన్ తెలుగు వెండితెరకు పరిచయమవుతున్నాడు. వచ్చేనెల 17వ తేదీన విడుదలకానున్న ఈ చిత్రం ట్రైలర్‌ను తాజాగా రిలీజ్ చేశారు. ఈ చిత్రంలోని విజువల్స్ ప్రతి ఒక్కరినీ కనులవిందు చేస్తున్నాయి. 
 
ఈ ట్రైలర్‌లో ఒక వైపున అడవిలో శకుంతల ఆశ్రమవాసం, మరోవైపున రాజ్యంలో దుష్యంతుడి రాజరికం. ఇద్దరి పరిచయం. ప్రేమ, వివాహం, విరహం, దుర్వాసుడి శాపం, భరతుడి జననం వరకు ఇందులో చూపించారు. అద్భుతమైన విజువల్స్‌తో ఈ ట్రైలర్ ఎంతగానో ఆకట్టుకుంటుంది. 
 
సమంత ప్రధానపాత్రను పోషించిన ఈ చిత్రంలో ఇతర ముఖ్యమైన పాత్రల్లో మోహన్ బాబు, ప్రకాశ్ రాజ్, గౌతమి నటించారు. మణిశర్మ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించారు. ఇది సినిమాకు హైలెట్‌గా నిలుస్తుందని దర్శకుడు గుణశేఖర్ గట్టిగా నమ్ముతున్నారు. 

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

RIP కాపుస్, కంగ్రాట్స్ కమ్మాస్.. పవన్‌పై ఆర్జీవీ ఫైర్