Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు ఏపీ పాలిసెట్ 2022 ఫలితాలు రిలీజ్

Webdunia
శుక్రవారం, 10 జూన్ 2022 (12:21 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ పాలిసెట్ 2022 ఫలితాలను శుక్రవారం వెల్లడించనుంది. ఇప్పటికే పాలిసెట్ ఆన్సర్ కీని స్టేట్ బోర్డు ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ఈ ఫలితాలను శుక్రవారం వెల్లడిచనుంది. 
 
పాలిసెట్‌ పరీక్ష ఫలితాలు ప్రకటించిన తర్వాత పరీక్ష హాజరైన విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌ https://polycetap.nic.in/ లేదా http://sbtetap.gov.in/ వెబ్‌సైట్లలో ఫలితాలను చూడొచ్చు. అదే రోజు ర్యాంక్‌ కార్డును కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
 
రిజిస్ట్రేషన్‌ వివరాలు, పుట్టిన తేదీని నమోదు చేయడం ద్వారా లాగినై ఏపీ పాలిసెట్ రిజల్ట్స్ 2022 ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చు. ఒకవేళ అర్హత మార్కుల్లో ఎవరికైనా సమానంగా మార్కులు వచ్చినట్లయితే మ్యాథమాటిక్స్, ఫిజిక్స్‌, పుట్టిన తేదీల వారీగా సరిచూసి ర్యాంకును కేటాయిస్తారు.
 
కాగా.. 2022-23 విద్యాసంవత్సరానికిగానూ పాలిటెక్నిక్‌, డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు మే 29న రాష్ట్ర వ్యాప్తంగా 404 పరీక్ష కేంద్రాల్లో పాలిసెట్‌ ప్రవేశ పరీక్ష జరిగింది. ఈ పరీక్షకు 1,37,371 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 1.25 లక్షల మంది విద్యార్థులు హాజరై పరీక్ష రాశారు. వీరంతా ఏపీ పాలిసెట్ రిజల్ట్స్ 2022 కోసం ఎదురు చూడాల్సివుంది. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments