Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

08-06-2022 బుధవారం రాశిఫలాలు ... గణపతిని పూజించినా మీకు శుభం...

Advertiesment
astro8
, బుధవారం, 8 జూన్ 2022 (04:00 IST)
మేషం :- స్థిరాస్తి కొనుగోలు యత్నాలు వేగం అవుతాయి. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలను ఎదుర్కొంటారు. వ్యాపార రంగాల వారికి అధికారుల తనిఖీలు, పనివారల నిర్లక్ష్యం ఆందోళన కలిగిస్తాయి. ఉద్యోగస్తులు ఒత్తిడి, ప్రలోభాలకు దూరంగా ఉండటం శ్రేయస్కరం.
 
వృషభం :- వస్త్రాలు, గృహోపకరణాలు సమకూర్చుకుంటారు. బ్యాంక్ వ్యవహారాల్లో మెళుకువ అసవరం. ఉపాధ్యాయులకు యాజమాన్యం ఒత్తిడి అధికం. మీ గౌరవ ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. పాడి పశువులు, పెంపుడు జంతువుల విషయంలో ఆందోళన చెందుతారు. స్త్రీల అవసరాలు, మనోవాంఛలు నెరవేరుతాయి.
 
మిథునం :- వాతావరణంలో మార్పు వల్ల స్వల్ప అస్వస్థతకు లోనవుతారు. మీరు ప్రతి పనిని స్వయంగా చేయడం వల్ల సుఖపడతారు. బ్యాంకు పనుల్లో ఒత్తిడి, హాడావుడి ఎదుర్కుంటారు. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది. వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం.
 
కర్కాటకం :- వ్యాపారాల్లో ఆటుపోట్లు, నష్టాలను క్రమంగా అధిగమిస్తారు. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. రుణాలు, చేబదుళ్లు ఇచ్చే విషయంలో జాగ్రత్త అవసరం. శారీరక శ్రమ, మానసిక ఒత్తిడి వల్ల అస్వస్థతకు గురవుతారు. విద్యార్థులకు హడావుడి, తొందరపాటు తగదు.
 
సింహం :- వ్యాపారాభివృద్ధికై చేయుప్రయత్నాలలో సత్ఫలితాలు పొందుతారు. మీ లక్ష్యసాధనకు బాగా కష్టపడాలి. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. మత్స్య, కోళ్ళ వ్యాపారస్తులకు సామాన్యంగా ఉంటుంది. పారిశ్రామిక రంగంలో వారికి కార్మికులకు మధ్య పరస్పర అవగాహన లోపం వంటివి ఆందోళన కలిగిస్తాయి.
 
కన్య :- వాగ్వివాదాలకు దిగిసమస్యలు కొని తెచ్చుకోకండి. ఆలయాలను సందర్శిస్తారు. స్థిరాస్తి క్రయవిక్రయాల్లో పునరాలోచన అవసరం. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనులు ఆశించినంత చురుకుగా సాగవు. సభలు, సమావేశాల్లో మీ ప్రసంగాలు పలువురిని ఆకట్టుకుంటాయి. నిరుద్యోగులకు ఒక వార్త ఎంతో సంతృప్తినిస్తుంది.
 
తుల :- పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి నిరుత్సాహం తప్పదు. కుటుంబీకుల మధ్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. స్థిరాస్తిని అమ్మటానికి చేయుయత్నాలు వాయిదా పడతాయి. ఉద్యోగాల్లో ఊహించిన మార్పులు, ఆదాయాభివృద్ధి ఉంటాయి. స్త్రీలు ఓర్పు, పట్టుదలతో శ్రమించి అనుకున్నది సాధిస్తారు.
 
వృశ్చికం :- మీ కళత్రమొండి వైఖరి, కుటుంబీకుల పట్టుదల మనశ్శాంతిని దూరం చేస్తాయి. బ్యాంకు వ్యవహారాల్లో మెళుకువ అసవరం. క్రీడలపట్ల నూతన ఉత్సాహం కానవస్తుంది. ఖర్చులు పెద్దగా లేకున్నా ధనవ్యయం, ధనసహాయం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఒక స్థిరాస్తి విక్రయించాలనే ఆలోచన విరమించుకోవటం ఉత్తమం.
 
ధనస్సు :- దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. ప్రేమికులకు నూతన ఆలోచనలు స్ఫురిస్తాయి. బంధుమిత్రులతో విభేదాలు తీరతాయి. వృత్తిపరంగా ఆదాయాభివృద్ధి, పరిచయాలు విస్తరిస్తాయి. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో జాగ్రత్త అవసరం. నిరుద్యోగులు ఉపాధి పథకాల్లో క్రమంగా నిలదొక్కుకుంటారు.
 
మకరం :- ఆదాయ వ్యయాలు సంతృప్తికరంగా ఉంటాయి. బంధువుల ఆకస్మికరాక ఆశ్చర్యం కలిగిస్తుంది. ఏజెంట్లకు, రిప్రజెంటేటికు ఒత్తిడి పెరుగుతుంది. స్త్రీలు విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీ సంతానం మొండివైఖరి మీకు చికాకులు కలిగిస్తుంది. ఉద్యోగస్తుల దైనందిన కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి.
 
కుంభం :- దంపతుల మధ్య అభిప్రాయభేదాలు చోటుచేసుకున్నా నెమ్మదిగా సమసిపోతాయి. విద్యార్థులకు కొత్త పరిచయాలు సంతృప్తినిస్తాయి. తలపెట్టిన పనులు ఉత్సాహంగా పూర్తి చేస్తారు. వైద్యులకు శస్త్ర చికిత్సలు నిర్వహించునపుడు మెళుకువ, ఏకాగ్రత అవసరం. ఖర్చుకు వెనుకాడకుండా విలువైన వస్తువులు సేకరిస్తారు.
 
మీనం :- నిత్యావసర వస్తు స్టాకిస్టులకు, వ్యాపారులకు పురోభివృద్ధి. ఉమ్మడి వెంచర్లు, సంస్థల స్థాపనలో పునరాలోచన అవసరం. ధనం ఏమాత్రం నిల్వ చేయలేకపోవడం వల్ల ఆందోళనకు గురవుతారు. ఉద్యోగస్తులకు అధికారులతో చికాకులు ఎదురవుతాయి. స్త్రీలు నరాలు, ఉదరానికి సంబంధించిన చికాకులు ఎదుర్కుంటారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

07-06-2022 మంగళవారం రాశిఫలాలు ... ఆంజనేయస్వామిని ఆరాధించడం వల్ల...