Webdunia - Bharat's app for daily news and videos

Install App

పండుగ సీజన్‌లో కస్టమర్లకు షాకిచ్చిన జొమాటో... ఎలా?

ఠాగూర్
శుక్రవారం, 25 అక్టోబరు 2024 (14:56 IST)
దేశ వ్యాప్తంగా పండుగ సీజన్ మొదలైంది. ఇలాంటి సమయంలో కస్టమర్లకు ప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో గట్టి షాకిచ్చింది. జొమాటో బుకింగ్స్‌పై వసూలు చేసే ఫ్లాట్‌‍ఫామ్ ఫీజును ఒక్కసారిగా భారీ పెంచేసింది. దీంతో ఇప్పటివరకు ఫ్లాట్‌ఫామ్ ఫీజును 60 శాతం మేర పెంచినట్టు అయింది. ఈ ప్రకటనతో ఫుడ్ ఆర్డర్ల రేట్లు మరింత పెరగనున్నాయి. 
 
పండగల సీజన్‌లో జొమాటో ఆర్డర్లకు సాధారణంగా డిమాండ్ అధికంగా ఉంటుంది. నిర్వహణ వ్యయాల కోసం ప్లాట్‌పామ్ ఫీజులను పెంచాల్సిన అవసరం ఏర్పడిందని జొమాటో తెలిపింది. దీపావళి సందర్భంగా ఆర్డర్ల సంఖ్య పెరుగుతుందని, వినియోగదారులకు చక్కటి సేవలను అందించడానికి పెంచిన ఈ రుసుము సహాయపడుతుందని కంపెనీ పేర్కొంది. 
 
ఈ నేపథ్యంలో తాజా మరోమారు ఈ ఫీజును పెంచేసింది. ఈ యేడాది జనవరి నెలలో కూడా ఫ్లాట్‌ఫామ్ ఛార్జీలను జొమాటో పెంచిన విషయం తెల్సిందే. ఆ సమయంలో రూ.4 ఉండగా రూ.6కు పెంచింది. తాజాగా రూ.6 నుంచి రూ.10కి పెంచింది. ఈ పెంపు ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డర్ ధరను ప్రభావితం చేస్తుంది. ప్రతి ఆర్డరుపై రూ.10 ప్లాట్‌ఫామ్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.
 
కాగా జొమాటో ఫ్లాట్‌పామ్ ఫీజు క్రమక్రమంగా పెరుగుతోంది. క్రమం తప్పకుండా అనేక సార్లు కంపెనీ పెంచింది. ఆరంభంలో రూ.1గా ఉండగా దానిని రూ.2కి, ఆపై రూ.3కి పెంచింది. 2023లో రూ.3 నుంచి రూ.4కి పెంచింది. ఆ తర్వాత క్రమంగా రూ.6కి పెరిగింది. దీపావళి నేపథ్యంలో పండగ సీజన్‌ను క్యాష్ చేసుకునేందుకు కంపెనీ తాజాగా రూ.10కి పెంచింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఎం రత్నంపై ఫిర్యాదులు - 'హరిహర వీరమల్లు' రిలీజ్‌కు చిక్కులా?

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments