Webdunia - Bharat's app for daily news and videos

Install App

యాడ్ తెచ్చిన తంటా : లవ్ జిహాద్‌కు తనిష్క్ మద్దతా? బాయ్‌కాట్ తనిష్క్ అంటూ ప్రచారం...

Webdunia
బుధవారం, 14 అక్టోబరు 2020 (18:21 IST)
దేశంలో ఉన్న ప్రముఖ ఆభరణాల నగల తయారీ కంపెనీల్లో ఒకటి తనిష్క్ జ్యూవెలరీ. ఇది తాజాగా విడుదల చేసిన యాడ్ పెను దుమారం రేపింది. ఈ యాడ్ లవ్ జిహాద్‌ను ప్రేరేపించేదిగా ఉందని పేర్కొంటూ సోషల్ మీడియాలో ట్రోల్ అవుతోంది. పైగా, నెటిజన్లు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. అంతేకాకుండా, బాయ్‌కాట్ తనిష్క్ అంటూ ఓ హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. 
 
ఇతకీ ఈ వివాదం వివరాలను పరిశీలిస్తే, ఇటీవల తనిష్క్ 'ఏకత్వం' పేరిట కొత్త నగల కలెక్షన్ తీసుకువచ్చింది. అయితే, ఈ 'ఏకత్వం' కలెక్షన్‌ను ప్రచారం చేసేందుకు రూపొందించిన వాణిజ్య ప్రకటన వివాదాస్పమైంది. ఇది లవ్ జిహాద్‌ను ప్రోత్సహించేలా ఉందంటూ సోషల్ మీడియాలో దుమారం రేగింది. దాంతో వెనక్కి తగ్గిన తనిష్క్ తన యాడ్‌ను సామాజిక మాధ్యమాల నుంచి తొలగించింది.
 
ఇంతకీ ఆ యాడ్‌లో ఏముందంటే... ఓ ముస్లిం కుటుంబం తమ ఇంటికి ఓ హిందూ యువతిని కోడలిగా ఆహ్వానిస్తుంది. ఆ హిందూ యువతికి హిందూ సంప్రదాయం ప్రకారమే సీమంతం నిర్వహిస్తారు. ఈ యాడ్ వీడియోలో కొన్ని వ్యాఖ్యలు కూడా ఉంటాయి. "తమ కన్నబిడ్డలా ఆదరించే ఇంటికి ఆమె కోడలిగా వెళ్లింది. ఆమె కోసం ఆ కుటుంబానికి చెందినవారు తమ సంప్రదాయాన్ని పక్కనబెట్టి వేడుక చేశారు. మామూలుగా అయితే ఇలా చేయరు. ఇది రెండు భిన్నమైన మతాలు, సంప్రదాయాలు, సంస్కృతుల అందమైన కలయిక" అంటూ తనిష్క్ అభివర్ణించింది.
 
ఈ తరహా అభివర్ణన నెటిజన్లకు ఆగ్రహం తెప్పించింది. ఈ యాడ్‌తో లవ్ జిహాద్‌కు తనిష్క్ మద్దతు పలుకుతున్నట్టుగా ఉందని, ఈ ప్రకటనను నిషేధించాలని సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేశారు. బాయ్‌కాట్ తనిష్క్ అనే హ్యాష్ ట్యాగ్‌తో హోరెత్తించారు. మంగళవారం, బుధవారం ఇదే ట్రెండింగ్‌లో ఉండటంతో తనిష్క్ తన యాడ్ వీడియోను తొలగించింది. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments