విజయ్ మాల్యాకు బ్రిటన్ కోర్టు ఝలక్.. ఎస్‌బీఐ ఎండీ అరిజిత్ హ్యాపీ హ్యాపీ

బ్యాంకులకు వేల కోట్ల మేర రుణాలు ఎగ్గొట్టి విదేశాల్లో లగ్జరీ లైఫ్ గడుపుతున్న లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు బ్రిటన్ కోర్టు వ్యతిరేకంగా ఆదేశాలు జారీ చేయడంపై ఎస్‌బీఐ మేనేజింగ్ డైరక్టర్ అరిజిత్‌ బసు హర్షం వ

Webdunia
శుక్రవారం, 6 జులై 2018 (16:50 IST)
బ్యాంకులకు వేల కోట్ల మేర రుణాలు ఎగ్గొట్టి విదేశాల్లో లగ్జరీ లైఫ్ గడుపుతున్న లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు బ్రిటన్ కోర్టు వ్యతిరేకంగా ఆదేశాలు జారీ చేయడంపై ఎస్‌బీఐ మేనేజింగ్ డైరక్టర్ అరిజిత్‌ బసు హర్షం వ్యక్తం చేశారు. తమ బకాయిలు వసూలు చేసుకునేందుకు అవకాశం కల్పించాలని కోరుతూ 13 బ్యాంకుల కన్సార్షియం వేసిన పిటిషన్‌ను విచారించిన బ్రిటన్‌ హైకోర్టు జడ్జి ఈ మేరకు సానుకూల ఉత్తర్వులు జారీ చేసింది. 
 
ఇంకా లండన్‌ సమీపంలోని హెర్ట్‌ఫోర్డ్‌ షైర్‌లో ఉన్న మాల్యా ఆస్తుల్లోకి ప్రవేశించేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారికి, ఆయన ఏజెంట్లకు కోర్టు అనుమతి మంజూరు చేసింది. హైకోర్టు ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారి.. తన అధికార పరిధిలో మాల్యాకు చెందిన వస్తువులను జప్తు చేసేందుకు, సోదాలు చేసేందుకు అనుమతిస్తున్నట్టు జస్టిస్‌ బిరాన్‌ తన ఆదేశాల్లో పేర్కొన్నారు. 
 
ఇకపోతే.. మాల్యాకు చెందిన దేశీయ ఆస్తుల వేలంతో రూ.963 కోట్లను రికవరీ చేసుకున్నామని అరిజిత్‌ బసు తెలిపారు. ఇక బ్రిటన్ కోర్టు కూడా మాల్యాకు వ్యతిరేకంగా తీర్పు ఇవ్వడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా.. మాల్యాను తమకు అప్పగించాలని కోరుతూ భారత ప్రభుత్వం చేసుకున్న అభ్యర్థనపై లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్‌ మాజిస్ర్టేట్‌ కోర్టులో జూలై 31న విచారణ జరుగనుంది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram Gopal Varma: రాంగోపాల్ వర్మ.. షో మ్యాన్..మ్యాడ్ మాన్స్టర్

Shivaj :ఓవర్సీస్ ప్రీమియర్లతో సిద్ధం చేస్తున్న ధండోరా

Dhanush: కృతి స‌న‌న్ తో ప్రేమలో మోసపోయాక యుద్ధమే అంటున్న ధనుష్ - అమ‌ర‌కావ్యం (తేరే ఇష్క్ మై)

అఖండ 2 డిసెంబర్ 12న వస్తోందా నిర్మాతలు ఏమన్నారంటే?

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments