ఇకపై జియో గిగా ఫైబర్ సేవలు.. ముకేశ్ అంబానీ
రిలయన్స్ జియో మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది. అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్‌తో ఇంట్లో ఉన్న కంట్రోల్ స్విచ్‌లను ఆపరేట్ చేసుకునే వెసులుబాటును కల్పించారు. దీన్నే జియో గిగా ఫైబర్‌గా పిలుస్తున్నట్లు ముఖేశ్ చెప్ప
రిలయన్స్ జియో మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది. అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్‌తో ఇంట్లో ఉన్న కంట్రోల్ స్విచ్‌లను ఆపరేట్ చేసుకునే వెసులుబాటును కల్పించారు. దీన్నే జియో గిగా ఫైబర్‌గా పిలుస్తున్నట్లు ముఖేశ్ చెప్పారు. జియో గిగా ఫైబర్ కోసం ఆగస్టు 15 నుంచి ఎన్‌రోల్మెంట్ ఉంటుందని ముఖేశ్ తెలిపారు. గత ఏడాది ముఖేశ్ కంపెనీ తన ఏజీఎం మీటింగ్‌లో రూ.1500 జియో ఫోన్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే.
గురువారం జరిగిన వార్షిక సమావేశంలో ఈ గిగా ఫైబర్‌ను ఆవిష్కరించారు. ఆయన షేర్‌హోల్డర్లను ఉద్దేశించి మాట్లాడుతూ, రిలయన్స్ లాభాలు 20.6 శాతం పెరిగినట్లు తెలిపారు. ఆ లాభం రూ.36 వేల 75 కోట్లకు చేరుకుందన్నారు. జీఎస్టీ కింద రిలయన్స్ సంస్థ రూ.42 వేల 553 కోట్లు చెల్లించినట్లు తెలిపారు.
ఫిక్స్‌డ్ బ్రాండ్‌బ్యాండ్‌లో ఇండియా ర్యాంకింగ్ తక్కువగా ఉందన్నారు. రిలయన్స్ ఇండస్ట్రీలో కంపెనీ ఇప్పటివరకు 250 మిలియన్ డాలర్లు పెట్టబడి పెట్టినట్లు చెప్పారు. ఫైబర్ ఆధారిత బ్రాడ్‌బ్యాండ్ సేవలను 1100 నగరాలకు విస్తరిస్తున్నట్లు ఆయన తెలిపారు. దీని వల్ల ఇంటర్నెట్ మరింత వేగంగా వస్తుందన్నారు.