#Dhadaktrailerlaunch కన్నీళ్లు పెట్టుకున్న ఖుషీ.. ఓదార్చిన జాన్వీ కపూర్..

అతిలోక సుందరి శ్రీదేవి మృతి ఆమె కుటుంబ సభ్యులకు తీరని లోటును మిగిల్చింది. ఫ్యాన్స్‌కు శ్రీదేవి మృతి షాకిచ్చింది. దుబాయ్‌లో ఆమె మరణించడాన్ని ఆమె కుమార్తె జాన్వి, ఖుషీ కపూర్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ

సోమవారం, 11 జూన్ 2018 (17:14 IST)
అతిలోక సుందరి శ్రీదేవి మృతి ఆమె కుటుంబ సభ్యులకు తీరని లోటును మిగిల్చింది. ఫ్యాన్స్‌కు శ్రీదేవి మృతి షాకిచ్చింది. దుబాయ్‌లో ఆమె మరణించడాన్ని ఆమె కుమార్తె జాన్వి, ఖుషీ కపూర్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ధర్మ మూవీస్ బ్యానర్‌పై శశాంక్ ఖైతాన్ దర్శకత్వంలో శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్‌గా, ఇషాన్ హీరోగా రూపొందుతోన్న 'ధడక్' సినిమా ట్రైలర్‌ సోమవారం విడుదలైంది. 
 
ఈ సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమానికి అనిల్‌ కపూర్‌, బోనీకపూర్‌లతో పాటు శ్రీదేవి చిన్న కూతురు ఖుషీ కపూర్‌ కూడా హాజరైంది. ఈ కార్యక్రమంలో శ్రీదేవిని తలుచుకుని కపూర్‌ కుటుంబ సభ్యులంతా భావోద్వేగానికి గురయ్యారు. 
 
జాన్వీని బాలీవుడ్‌కు పరిచయం చేసిన శ్రీదేవి ఆమె మొదటి సినిమా చూడకుండానే కన్నుమూయడంపై ఖుషీ కపూర్‌.. తల్లిని తలుచుకుని కన్నీరు పెట్టుకుంది. దీంతో తన చెల్లిని జాన్వీ కపూర్‌ ఓదార్చింది. కాగా మరాఠీ సినిమా ''సైరత్''కు రీమేక్‌గా ''దడఖ్'' చిత్రాన్ని రూపొందించిన సంగతి తెలిసిందే.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం 'ధడక్' మూవీ ట్రైలర్ రిలీజ్... జాన్వీ నటన అదుర్స్...