బావకు గుణపాఠం చెప్పాలని కటకటాల పాలయ్యాడో బావమరిది..
సోదరిని ఇబ్బంది పెడుతున్నాడని వేరే వారితో బెదిరించేందుకు సుపారి ఇచ్చాడో బావమరిది. తనకు తోడుగా వచ్చిన తన బావమరిదే అసలు నేరస్థుడు అని తేలడంతో అవాక్కయ్యాడు బావ. అంబర్ పేటకు చెందిన నరేష్, శ్రీనివాస్ బావాబామ్మర్దులు. నరేష్ తన సోదరితో గొడవ పడుతున్నాడని
సోదరిని ఇబ్బంది పెడుతున్నాడని వేరే వారితో బెదిరించేందుకు సుపారి ఇచ్చాడో బావమరిది. తనకు తోడుగా వచ్చిన తన బావమరిదే అసలు నేరస్థుడు అని తేలడంతో అవాక్కయ్యాడు బావ. అంబర్ పేటకు చెందిన నరేష్, శ్రీనివాస్ బావాబామ్మర్దులు. నరేష్ తన సోదరితో గొడవ పడుతున్నాడని తెలుసుకున్న శ్రీనివాస్.. బావకు గుణపాఠం చెప్పాలని భావించాడు.
ఇందుకోసం ముగ్గురు మిత్రులకు సుపారి ఇచ్చాడు. బావతో కలసి ఓ ఫంక్షనుకు వెళ్ళి వస్తుండగా.. అడ్డుకుని దాడి చేసి నగదు, సెల్ ఫోన్ తీసుకుని వెళ్లిపొమ్మని వారికి స్కెచ్ వేసి వచ్చాడు. బావ నరేష్‌తో కలసి వస్తూ శ్రీనివాస్.. పూర్తి సమాచారాన్ని సుపారి గ్యాంగ్‌కు ఇచ్చాడు. పధకం ప్రకారం సికింద్రబాద్ బౌద్దనగర్‌లో నరేష్, శ్రీను వస్తున్న సమయంలో వారిపై దాడి చేసి సెల్ ఫోన్, నగదు లాక్కుని వెళ్ళిపోయారు.
దీంతో చిలకలగూడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు బాధితుడు నరేష్. రంగంలోకి దిగిన పోలీసులు శ్రీనివాస్ పైన అనుమానంతో.. టెక్నికల్ టీం సహాయంతో డేటా సేకరించారు. చివరికి దాడి చేసిన ముగ్గురు నిందితులతో పాటు బావమరిది శ్రీనివాస్‌ను కటకటాల వెనక్కి నెట్టారు.