Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హే సమంత నీ ఛాలెంజ్ స్వీకరిస్తున్నా.. నమ్రతా రెడీనా: ఉపాసన

కేంద్ర మంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ ''హమ్ ఫిట్ ఇండియా ఫిట్'' పేరిట కొత్త విధానానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఫిట్‌నెస్ ఛాలెంజ్ పేరిట నెట్టింట ఈ పద్ధతి వైరల్ అవుతోంది. ఈ ఛాలెంజ్‌ను స్వీకరిం

Advertiesment
హే సమంత నీ ఛాలెంజ్ స్వీకరిస్తున్నా.. నమ్రతా రెడీనా: ఉపాసన
, బుధవారం, 6 జూన్ 2018 (16:06 IST)
కేంద్ర మంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ ''హమ్ ఫిట్ ఇండియా ఫిట్'' పేరిట కొత్త విధానానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఫిట్‌నెస్ ఛాలెంజ్ పేరిట నెట్టింట ఈ పద్ధతి వైరల్ అవుతోంది. ఈ ఛాలెంజ్‌ను స్వీకరించడం ఇతరులకు ఛాలెంజ్ చేయడం ప్రస్తుతం ఫ్యాషనైపోయింది. చాలామంది సెలెబ్రిటీలు ప్రస్తుతం ఈ ఛాలెంజ్ కోసం జిమ్‌ల వెంట తిరుగుతున్నారు. 
 
ఈ నేపథ్యంలో నాగచైతన్య సవాల్‌ను స్వీకరించిన సమంత, జిమ్‌లో వ్యాయామం చేస్తున్న వీడియోను పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా హీరో రామ్ చరణ్ భార్య ఉపాసనను ఈ ఛాలెంజ్‌లోకి ఆహ్వానించింది. ఇందుకు స్పందించిన ఉపాసన జిమ్‌లో కసరత్తు చేస్తున్న వీడియోను ట్విట్టర్లో పోస్టు చేసింది.
 
''హే సమంత.. నేను విహారయాత్రలో ఉన్నప్పటికీ నీ ఛాలెంజ్ ను స్వీకరిస్తున్నా. నమ్రతా శిరోద్కర్, తరుణ్ తహిలియానీ, కనికా కపూర్, పింకీ రెడ్డి అండ్  అపోలో లైఫ్ స్టూడియోలోని ట్రైనర్స్‌కు నేను ఛాలెంజ్ విసురుతున్నా'' అని ఉపాసన తెలిపింది. 
 
మరోవైపు ఎన్టీఆర్ ఛాలెంజ్‌‌ను స్వీకరించిన రామ్‌ చరణ్ కూడా ఉపాసన సోషల్‌ మీడియా పేజ్‌తో తన వర్క్‌ అవుట్ వీడియోను పోస్ట్ చేశారు. చెర్రీ.. సుకుమార్‌, కేటీఆర్, అబూ జైన్‌ సందీప్‌ కోస్లా, శోభన కామినేని, వరుణ్ తేజ్‌‌లతో పాటు మెగాస్టార్‌ చిరంజీవికి చెర్రీ చాలెంజ్‌ చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జెమినీ గణేశన్ వల్లే సావిత్రి హీరోయిన్ అయినట్లు చూపించారు.. తమ్మారెడ్డి