Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆ తల్లి తన ముగ్గురు బిడ్డలకు విషమిచ్చింది...

నవమాసాలు మోసి పిల్లలకు జన్మనిచ్చిన ఓ కన్నతల్లి పేగుబంధాన్ని మరిచింది. ముగ్గురు పిల్లలకు విషమిచ్చి తాను విషం సేవించింది. ఈ ఘటన కామారెడ్డి జిల్లా గాంధారి మండలం గుర్జాల్ గ్రామంలో చోటు చేసుకుంది. సదాశివనగర్ మండలం లింగంపల్లి గ్రామానికి చెందిన సుజాతకు గాం

Advertiesment
ఆ తల్లి తన ముగ్గురు బిడ్డలకు విషమిచ్చింది...
, బుధవారం, 6 జూన్ 2018 (19:41 IST)
నవమాసాలు మోసి పిల్లలకు జన్మనిచ్చిన ఓ కన్నతల్లి పేగుబంధాన్ని మరిచింది. ముగ్గురు పిల్లలకు విషమిచ్చి తాను విషం సేవించింది. ఈ ఘటన కామారెడ్డి జిల్లా గాంధారి మండలం గుర్జాల్ గ్రామంలో చోటు చేసుకుంది. సదాశివనగర్ మండలం లింగంపల్లి గ్రామానికి చెందిన సుజాతకు గాంధారి మండలం గుర్జాల్ గ్రామానికి చెందిన పడమటి ఉమేష్‌తో 2009లో వివాహం జరిగింది. వీరికి నందిని, 7 నెలల కవల పిల్లలు ధనుష్, ధరణి ఉన్నారు. 
 
ఇన్నేళ్లు కాపురం సజావుగానే సాగింది. బుధవారం రోజున ఉదయం కుటుంబ సభ్యులు ఉపాధి హామీ పనులకు వెళ్లారు. ఇంట్లో సుజాత తన పిల్లలతో ఉంది. ఏమైందో తెలియదు గానీ పెద్దమ్మాయి నందినికి జ్యూస్ అని చెప్పి పురుగుల మందు తాగించింది. అదే మందును తాను తాగి అభంశుభం తెలియని పసికందులకు కూడా పట్టించింది. దాంతో పిల్లల పరిస్థితి విషమంగా తయారైంది. గమనించిన చుట్టుపక్కల వారు కుటుంబ సభ్యులకు విషయం తెలుపగా వీరిని వెంటనే కామారెడ్డిలోని జయ ఆస్పత్రికి తరలించారు.
 
సుజాతను మాత్రం ఎల్లారెడ్డిపేటలోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. జయ ఆస్పత్రిలో పిల్లలను పరిశీలించిన వైద్యులు వెంటనే వారిని కామారెడ్డిలోని సిరి చిల్డ్రన్స్ హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ పిల్లలను పరీక్షించిన వైద్యులు పరిస్థితి విషమంగా ఉందని, 48 గంటలు గడిస్తే తప్ప ఏమి చెప్పలేమని వెంటనే వీరిని హైదరాబాదుకు తరలించాలని సూచించగా కుటుంబ సభ్యులు మాత్రం ఎల్లారెడ్డిపేట్ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన జరగడానికి గల కారణాలు మాత్రం తెలియాల్సి వుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జనసేనాని, జగన్ మోహన్ రెడ్డిలకు టిటిడి నోటీసులు ఇస్తుందా?