Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

విజేత ఆడియో రిలీజ్ : చిన్నల్లుడు గురించి చిరంజీవి ఏమన్నారు?

మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్. ఈయన్ను వెండితెరకు పరిచయం చేస్తూ తీసిన చిత్రం విజేత. సాయి కొర్ర‌పాటి వారాహి సంస్థ‌లో ర‌జినీ కొర్ర‌పాటి నిర్మాత‌గా, రాకేశ్ శశి దర్శకత్వంలో 'విజేత' చిత్రం తె

Advertiesment
విజేత ఆడియో రిలీజ్ : చిన్నల్లుడు గురించి చిరంజీవి ఏమన్నారు?
, సోమవారం, 25 జూన్ 2018 (11:47 IST)
మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్. ఈయన్ను వెండితెరకు పరిచయం చేస్తూ తీసిన చిత్రం విజేత. సాయి కొర్ర‌పాటి వారాహి సంస్థ‌లో ర‌జినీ కొర్ర‌పాటి నిర్మాత‌గా, రాకేశ్ శశి దర్శకత్వంలో 'విజేత' చిత్రం తెరకెక్కింది. మాళ‌విక న‌య్య‌ర్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రానికి హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రామేశ్వ‌ర్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం ఆడియో రిలీజ్ కార్యక్రమం ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి చిరంజీవి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...
 
"విజేత" అనే టైటిల్ పెట్టిన వెంటనే నాకు నా సినిమా, 35 సంవత్సరాల క్రితం నేను చేసిన సినిమా గుర్తుకొచ్చింది. టైటిల్ కావాలని పెట్టారా.. కథకు సంబంధించి అదే టైటిల్ పెట్టాల్సి వచ్చిందా..? ఏమో తెలియదుగానీ, కథాంశానికి సంబంధించి కూడా చాలా సారూప్యం ఉంది ఆ విజేతకి ఈ విజేతకి. రాకేశ్ శశి, కొర్రపాటి సాయి నా దగ్గరకి వచ్చి కథ ఒకసారి మీరు వినాలి అన్నప్పుడు, ఆ కథ చెప్పారు. మొట్టమొదటిసారి విన్నప్పుడే చాలా ఇంప్రెసివ్‌గా అనిపించింది. చక్కటి మధ్యతరగతి కుటుంబ కథా చిత్రం. 
 
ముఖ్యంగా తండ్రికొడుకుల మధ్య జరిగే సెంటిమెంట్ సీన్స్ గానీ, ఎమోషన్ సీన్స్ గానీ ఇవన్నీ కూడా మనసుకు హత్తుకునేలా ఉన్నాయి. అక్కడకక్కడ కళ్లుచమర్చే విధంగా ఉంది. ఎంతో ఆసక్తికరంగా కొన్ని సన్నివేశాలు చోటుచేసుకున్నాయి. కథ వినగానే రాకేశ్ చాలా మంచి సబ్జెక్ట్ అనుకున్నావు. ఖచ్చితంగా ఇచ్చి సక్సెస్ అవుతుంది. గో హెడ్ అని చెప్పాను అని వివరించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బిగ్‌బాస్-2.. నూతన నాయుడు అవుట్.. నాని హోస్ట్‌తో రేటింగ్ అదుర్స్..!