Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బిగ్‌బాస్-2.. నూతన నాయుడు అవుట్.. నాని హోస్ట్‌తో రేటింగ్ అదుర్స్..!

బిగ్‌బాస్-2 నుంచి ఇప్పటికే సామాన్యురాలిగా హౌస్‌లోకి వచ్చి.. వారం తిరగకముందే హౌస్ నుంచి ఎలిమినేషన్ అయిన సంజన గురించి తెలిసిందే. వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీతో హౌస్‌లోకి ప్రవేశించిన హీరోయిన్‌ నందిని రాయ్‌ కోస

Advertiesment
Bigg Boss Telugu Season 2
, సోమవారం, 25 జూన్ 2018 (11:05 IST)
బిగ్‌బాస్-2 నుంచి ఇప్పటికే సామాన్యురాలిగా హౌస్‌లోకి వచ్చి.. వారం తిరగకముందే హౌస్ నుంచి ఎలిమినేషన్ అయిన సంజన గురించి తెలిసిందే. వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీతో హౌస్‌లోకి ప్రవేశించిన హీరోయిన్‌ నందిని రాయ్‌ కోసమే తనను తప్పించారని సంజనా సైతం బయటకు వచ్చిన అనంతరం ఆరోపించారు. తాజాగా బిగ్‌బాస్‌-2 సీజన్‌లో మరో సామాన్యుడు ఎలిమినేట్‌ అయ్యాడు.
  
 
ఆదివారం జరిగిన ఎపిసోడ్‌లో సైతం కామన్‌ మ్యాన్‌ నూతన నాయుడే ఎలిమినేట్‌ కావడం ప్రస్తుతం వివాదానికి దారితీసింది. నూతన నాయుడి ఎలిమినేషన్‌లో బిగ్‌బాస్‌ తప్పేమీ లేదని..ఓ పిట్టకథతో క్లారిటీ ఇచ్చాడు. ఈ ఎపిసోడ్‌లో ఫుల్‌ ఎనర్జటిక్‌గా నాని అలరించాడు. శనివారం కాస్త సీరియస్‌గా షో కొనసాగగా.. ఈ ఎపిసోడ్‌ మాత్రం పూర్తి ఫన్నీగా సాగింది. తనదైన కామెడీ టైమింగ్‌తో నాని హోస్ట్‌గా అదరగొట్టాడు. మంచోడికి మూడింది.. అనే ఫన్ని టాస్క్‌తో హౌస్‌లో కంటెస్టెంట్‌లతో నాని ఓ ఆట ఆడుకున్నాడు. ఈ వారం బిగ్ బాస్ షో ప్రేక్షకులను ఆకట్టుకుంది. 
 
ఇదిలా ఉంటే.. ఈ నెల పదో తేదీన బిగ్‌బాస్‌ సీజన్‌-2ని ప్రారంభించిన నేచురల్ స్టార్‌ నాని సక్సెస్ దిశగా దూసుకుపోతున్నాడు. ''ఏదైనా జరగొచ్చు రెడీగా ఉండడంటూ'' ఆసక్తి రేపిన నాని బిగ్‌బాస్‌-2ను సక్సెస్‌ దిశగా నడిపిస్తున్నాడు. మొదట బిగ్‌బాస్‌ పట్ల ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ ఆ షోను చాలా మంది చూస్తున్నట్టు తేలింది.
 
తొలివారం ఈ కార్య‌క్ర‌మం అత్యధికంగా టీఆర్‌పీ రేటింగ్స్‌ సాధించి అగ్రస్థానంలో నిలిచింది. బీఏఆర్సీ గణాంకాల ప్ర‌కారం సీజ‌న్ 2 లాంచింగ్ ఎపిసోడ్‌కి టీఆర్పీ రేటింగ్‌ 15.05 వచ్చింది. వీక్ డేస్‌లో 7.93గా న‌మోదు అయింది.

సీజన్‌-1లో జూ.ఎన్టీఆర్ హోస్ట్‌గా ఉన్నప్పుడు మొదటి వారంలో వచ్చిన రేటింగ్స్‌కు ఇది కాస్త తక్కువే అయినప్పటికీ, ఈ షో పట్ల ప్రేక్షకుల్లో ఆసక్తిని తగ్గకుండా చేశాడు నాని హోస్ట్‌గా వ్యవహరించాడు. ఈ షో ప్రతి శని, ఆదివారాల్లో రాత్రి 9 గంటలకు, ప్రతి సోమ, శుక్ర వారాల్లో రాత్రి 9.30 గంటలకు స్టార్‌ మాటీవీలో ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రేణూ దేశాయ్‌కు నిశ్చితార్థం.. ఫోటో వైరల్